అలంపూర్ కోర్టులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

Dec 10, 2024 - 17:38
 0  24
అలంపూర్ కోర్టులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ జడిసియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో మంగళవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 9 ని పురస్కరించుకొని  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్ట్ ప్రాంగణంలో న్యాయమూర్తి మిథున్ తేజ అధ్యక్షతన ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచినప్పుడు వారిని పోలీసులు ఏమైనా కొట్టారా అని , ఎవరైనా ఇబ్బంది కాని బలవంతం కానీ చేసారా అని అడగడం జరుగుతుందని ఎక్కడైనా , ఏ సందర్భంలోనైనా వారి హక్కులకు భంగం వాటిల్లిందేమో అని తెలుసుకోవడానికే మాత్రమే  అని అన్నారు , ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా , గౌరవంగా, సమానత్వంగా  సమాజంలో   బ్రతకడానికి  మన రాజ్యాంగం లో అవకాశం  కల్పించారని అవన్ని మనకు జన్మతహా సంక్రమిస్తాయని అన్నారు . ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ , న్యాయవాదులు నారాయణ్ రెడ్డి  , యూదుర్బాషా , తిమ్మారెడ్డి , శ్రీశర్ రెడ్డి , శ్రీనివాసులు కరుణాకర్ రావ్ , వెంకటేష్ , శ్రీమతి రాజేశ్వరి , కరుణాకర్ రావ్ , అలంపూర్ కోర్ట్  ఏజీపీ మధు , తాలూకా న్యాయసేవాధికార సంస్థ  సిబ్బంది  అలంపూర్ ఏఎస్ఐ బాషా తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333