ప్రాజెక్టుల పేరుతో కోట్లు మింగిన కేసీఆర్

Aug 30, 2024 - 17:20
Aug 30, 2024 - 17:21
 0  4
ప్రాజెక్టుల పేరుతో కోట్లు మింగిన కేసీఆర్

హైదరాబాద్‌:- గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోట్ల కొద్దీ ప్రజాధనం దుర్వినియోగం చేసిందని, ఆప్పటి సీఎం కేసీఆర్‌ డెకాయిట్‌ గా మారి రాష్ట్ర ఖజానాను లూఠీ చేశారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విరుచుకు పడ్డారు. శుక్రవారం ఆయన ములుగు జిల్లా తుపాకుల గూడెంలోని సమ్మక్క ప్రాజెక్టును జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా మంత్రి సీతక్కతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ప్రారంభోత్సవం చేయిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు కట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని విరుచుకుపడ్డారు. ఇందుకు విరుద్ధంగా తమ ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చాలన్నసంకల్పంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333