అయిజ లయోలా స్కూల్ బస్సు ఢీకొని బల్గేర గ్రామానికి చెందిన ముక్కరయ్య మృతి
జోగులాంబ గద్వాల 28 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గట్టు మండలం బల్గేర గ్రామంలో ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనక నుండి ఢీ కొట్టిన స్కూల్ బస్సు గాయాల పాలైన వ్యక్తిని గద్వాలప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో తీవ్ర ఆవేదనలో కుటుంబ సభ్యులు... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న రవాణా శాఖఅధికారులు ఐజ పట్టణంలో ఫిట్నెస్ పర్మనెంట్ ఇన్సూరెన్స్ లేని లయోలా స్కూలుకు చెందిన ప్రవేట్ స్కూల్ బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు.