అయిజ మున్సిపాలిటీలో కాలయాపన చేస్తున్న అధికారులు

Jan 29, 2026 - 19:14
 0  4

జోగులాంబ గద్వాల 29 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. పట్టణం లో ఎన్నికల సందర్బంగా,బేబాకీ (నో డివ్) సర్టిఫికెట్ అభ్యర్థులకు సంబందించి ఇంటి పన్ను,కొళాయి పన్ను ఇవ్వకుండా కాలయాపన చేసూన్నారు అని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రామచంద్ర రెడ్డి మండిపడ్డారు.

 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కు సమయం రెండు రోజులే ఉండడంతో ప్రతిపక్షా అభ్యర్థులకు మున్సిపల్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారని వారు అన్నారు.అధికార పార్టీ కి వత్తాసు పలుకుతున్నా అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తీవ్ర ఆందోళన చేస్తామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో  బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333