అబా కార్డ్స్ ఎన్సీడీ పోర్టల్ నందు లింక్ చేయండి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు
జోగులాంబ గద్వాల 29 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఆదేశాల మేరకు ఈరోజు పాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉపేర్... అందరూ ఏఎన్ఎం లకు MLHP సిబ్బందికి మరియు సూపర్వైజర్ క్యాడర్ వారికి ఎన్సిడి పై రివ్యూ ప్రతినెల ఫాలోప్... ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను ఎన్సిడి పోర్టల్ నందు లింక్ చేసే విధానం పై ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఏ నెలలకు అవగాహన కలిగించడం జరిగింది... ప్రతిరోజు అబా కార్స్ లింక్ చేసిన తర్వాత సంఖ్యను జిల్లాకు తెలుపాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు తెలిపారు. అదేవిధంగా వారి యొక్క ట్యాబ్ లను ఆన్ చేసి ఒక్కొక్క ఏఎన్ఎం అబాకార్డుల ను లింక్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్షుద్, డిడియం రామాంజనేయులు, కళ్యాణి హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.