అన్ని గ్రామాలలోఐకెపి కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. 

Apr 4, 2024 - 23:46
 0  4
అన్ని గ్రామాలలోఐకెపి కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. 

ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. 

 కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి. 

 కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. 

 సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు 

 సూర్యాపేట :-  యాసంగి ధాన్యం చేతికి వచ్చినందున అన్ని గ్రామాల్లో వెంటనే ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మభిక్షం  భవన్ లో నిర్వహించిన సిపిఐ  పార్టీ ముఖ్య నాయకుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగి వరి సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వర్షాభావంతో ఇప్పటికే సగం వరి చేలు ఎండిపోయాయన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయించిన  మద్దతు ధరల బ్యానర్ పెట్టాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్ 500రూ కూడా ఈ రబి లో రైతుల ఎకౌంట్లో జమ చేయాలని  కోరారు. జిల్లాలో అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలలో అద్దె బోర్లా ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న చేతి పంపులను వెంటనే రిపేరు చేయాలని కోరారు. జిల్లాలో వేలాది ఎకరాలలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న పట్టించుకున్న నాధుడే కరువాయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితుల ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు  మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు చామల అశోక్ కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి కొండలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333