జనం మెచ్చిన నాయకులు
ఘనంగా అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట: రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు, జనం మెచ్చిన నేత జనం కోసం నిత్యం తప్పించే నాయకులు ప్రజలు మెచ్చిన నాయకుడు అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు ఆత్మకూరు మండలం నెమ్మికల్ లో ఓ ఫంక్షన్ హాల్లో జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు పిండిగ విజయ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి గురువారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని నాయకులుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ఎంతో కృషి చేశాడని తెలిపారు. భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఉన్నతమైన రాజకీయ పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కినపల్లి రమేష్, ఆలకుంట్ల కృష్ణ, చిరంజీవి, నిద్ర సంపత్ నాయుడు, కుమార్, అశోక్, భాను ప్రసాద్,బయ్య దేవేందర్ యాదవ్,ముజీబ్, వెంకన్న నాయక్, నవీన్ నాయక్, వల్లపురమేష్, నాగేశ్వరరావు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.