ప్రపంచపటంలో ఫణిగిరిని నిలిపిన బౌద్ధ శిల్పాలు

ప్రజల పూర్తి సహకారం కావాలి  శైలజరామఅయ్యర్.

Apr 4, 2024 - 23:48
 0  3
ప్రపంచపటంలో ఫణిగిరిని నిలిపిన బౌద్ధ శిల్పాలు
ప్రపంచపటంలో ఫణిగిరిని నిలిపిన బౌద్ధ శిల్పాలు

సూర్యాపేట :-  ఫణిగిరిలో లభించిన అద్భుతమైన చారిత్రత్మాక భౌద్ధ శిల్పాలు, నాణేలు, వంటి వాటితో మారుములనున్న ఫణిగిరి గ్రామం  ప్రపంచ పటంలో నిలిచిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పర్యాటక సాంస్కృతిక, క్రీడలు పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామఅయ్యర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా, నాగారం మండలం ఫణిగిరి గ్రామంలోని భౌద్ధ క్షేత్రం కొండపై జరుపుతున్న తవ్వకాలలో వెలువడిన సీసాపు నాణాలను సంబందించి పెట్టిన విలేకరుల  సమావేశములో ఆమె మాట్లాడుతు  ఫణిగిరిలోని తవ్వకాలలో లభించిన సీసాపు నాణేలతో ఒక మైలు రాయిని దాటిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి, నాగార్జున కొండలలో లభించిన భౌద్ధ చారిత్రిక అనవాళ్లను మించి ఫణిగిరిలో లభ్యమవుతున్నాయని ఇవి చాలా అద్బుత మైనవని కొనియాడారు . చరిత్రలో ఇది మరచిపోలేని రోజని క్రీ. శ. 2 నుండి క్రీ. శ. 4 వ శతాబ్ధం వరకు ఇంత పెద్ద మొత్తంలో 3730 నాణేలు లభించటం అరుదైన విషయం అన్నారు. ఈ నాణెములపై ఒక వైపు ఏనుగు, మరొక వైపు ఉజ్జయని గుర్తును కలిగియున్నవని ఇవి ఇక్ష్వాకుల కాలo నాటి  నాణేలుగా నిర్ధారించడం జరిగిందని ఆమె తెలిపారు.  ఫణిగిరిలో మ్యూ జియం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ తన పూర్తి సహకారాన్ని అందించారని, దీనివలన ఇక్కడ తవ్వకాలలో లభించిన చారిత్రత్మాక ఆధారాలు, పురాతన ఆధారాలు పర్యాటకులు తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ లభించిన ప్రతి భౌద్ధ మహా స్తూపం, ఉద్దేశిక స్థూపాలు, సభ మండపాలు, శిలా శాసనాలు, నాణెములు ,వీటన్నిటికీ ఫణిగిరి గ్రామ ప్రజలే వారాసులని, ప్రజలు సహకరించాలని అందరం కలిసి ఫణిగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుదామని ,మీడియా ద్వారా ప్రపంచనికి తేలేసే విధంగా తొడ్పాలని తెలిపారు. 
ఈ సందర్బంగా సంచాలకులు తెలంగాణ వారసత్వ శాఖ . భారతి హోళ్ళికెరీ మాట్లాడుతూ అర్కలాజి  ఇండియా వారి అనుమతితో తవ్వకాలు మొదలు పెట్టమని ఇప్పటి ఏడు సార్లు తవ్వకాలు నిర్వహించటం జరిగిందని, ఇంకా రెండు చోట్ల తవ్వకాల అనుమతి కొరకు అడగటం జరిగిందని ,ఇక్కడ లభించిన ఎంతో విలువైన చారిత్రత్మాక ఆధారాలు లాభిస్తున్నాయని  అందులో ముక్యమైనవి విహారాలు, గాజు,రాతీ పూసలు ,విరిగిన సున్నపు రాతి విగ్రహాలు లభించాయని తెలిపారు.
2400 సం,,ల క్రితమే ఎలాంటి సాంకేతిక పరికరాలు లేని రోజుల్లోనే పెద్ద పెద్ద రాళ్ళను కొండల పైకి తీసుకువచ్చి శిల్పాలు గా మలచి వారి చరిత్రను చటారని ఆమె అన్నారు. ఇక్కడ లభించిన భౌద్ధ స్థూపాలను  కోన్ని న్యూయార్క్ మ్యూ జియం లో కూడా ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. ఆనాటి కాలంలో ఉన్న చరిత్రను ప్రజలకు తెలపటానికి ఇవి ఎంతో ఉపయోగ పడతాయని ఆమె అన్నారు. ఇక్కడ జరుగుతున్న తవ్వకాలకు మీ పూర్తి సహకారం కావాలని ఆమె కోరారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్ లత, ఉప సంచాలకులు నారాయణ.అదనపు సంచాలకులు మల్లు నాయక్, తహసీల్డర్  భ్రమయ్య ,అధికారు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333