అడ్డగూడూరులో 2వ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని

అర్థనగ్న ప్రదర్శనతో నిరసన

Sep 5, 2025 - 21:06
Sep 5, 2025 - 21:21
 0  11

అడ్డగూడూరు 05 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు అందరు కలిసి స్థానిక అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రెండో విడత దళిత బంధు నిధుల విడుదలలో భాగంగా ఎకౌంట్లో జమ చేసిన 3 లక్షల రూపాయలతో పాటు ఏడు లక్షల రూపాయలను నిధులు జమ చేసి గ్రౌండింగ్ పూర్తి చేసి ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలని వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయాలని అర్థ నగ్న ప్రదర్శనలతో పాటు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏదైతే దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టింది.దళిత బంధు పథకాన్ని అమలు చేయడమే కాకుండా రెండో విడతలో భాగంగా రెండు మండలాలు అడ్డ గూడూరు,మోత్కూర్ లబ్ధిదారులకు నిధులు గత ప్రభుత్వం జమ చేసింది ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వాలు మారి అకౌంట్ ఫ్రీజింగ్ లో ఉన్నది.తద్వారా ఈ అకౌంట్ ని ఫ్రీజింగ్ నుంచి తొలగించాలని పలుమార్లు కలెక్టర్లను,ఈడి ఎన్నో సార్లు అధికారులను కలిసిన పలితం శూన్యంగా మారింది..గత నెలలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలేను కూడా కలిసి నిధులను విడుదల చేయాలని విన్నవించుకోవడం జరిగింది.తద్వారా అధికారులు సానుకూలంగా స్పందించిన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా నిధుల విడుదలలో జాప్యం జరుగుతా ఉన్నది కాబట్టి మా ఆవేదన మా బాధ తెలియజేయడానికి శుక్రవారం రోజు అడ్డగూడూరు మండలం కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది.అధికారులాను నిధులు విడుదల చేయాలని మేము వేడుకుంటున్నాము... అలాగే ఒక విన్నపం చేస్తూ..మాయందు అధికారులు మాపై దయ తలిచి నిధులు విడుదల చేయాలని మీ సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు బాలెంల నరేందర్ ,జిల్లా శివాజీ,ఈటికాల ఆంజనేయులు,కడియం నాగన్న,ఈదుల శ్రీనివాస్,బోనాల మహేందర్,జక్కుల గిరి, ఇరుగు లక్ష్మణ్,పనుమటి ప్రభు,కూరేళ్ల రమేష్,శ్రీరాముల నర్సింహ,ఈమ్యనియెల్,తల్లపెళ్లి కృష్ణ,గుగ్గిల భరత్,సురారం రాజు,బండి వెంకటేష్, మందుల విజయ్,తలపాక మహేష్,దర్శనాల మహేందర్,గూడెపు పరమేష్,గూడెపు సుభద్ర, బాలెంల మధు,చిప్పలపెళ్లి నరేందర్, సైదులు,సోమన్న, లబ్ధిదారుల తదితరులు పాల్గొన్నారు.