అంబేద్కర్ విగ్రహ పోస్టర్ ఆవిష్కరణ

అడ్డగూడూరు 23 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో 25/06/2025 బుధవారం రోజున అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విగ్రహ ఆవిష్కర్త పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు,సబండ వర్గాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బాకీ సుధీర్,గజ్జెల్లి రవి,మందుల కిరణ్,తలపాక మహేష్,కందుల ప్రశాంత్,బోడ యాదగిరి,కడియం సంజీవ, బాలెంల బాబురావు, సోమయ్య వీరయ్య, రాములు, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.