అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన సితారంపురం గ్రామ ప్రజలు

గుండాల14ఏప్రిల్ 2025 తెలంగాణావార్త రిపోర్టర్:-
అంటరానితనం సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమానవాటా కోసం,సామాజిక న్యాయం కోసం,తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు కొనియాడారు.భారత రత్న, రాజ్యాంగ నిర్మాత,డాక్టర్"బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా,ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా దేశానికి వారందించిన కృషిని స్మరించుకున్నారు.భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని సితారంపురం ప్రజలు పేర్కొన్నారు.ముందుచూపుతో బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని పునరుద్ఘాటించారు.అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం,దళిత బంధు సహా పలు పథకాల రూపంలో అమలు చేసిందని, పదేండ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు,భారత జాతి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించేందుకు పాల్గొన్న గ్రామస్థులు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాటూరు కాశయ్య,వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేశ్,పెగ్గపురం రాములు,పెగ్గపురం వెంకటయ్య,జో యాదయ్య,సీతాల యాదయ్య,దామర యాదయ్య,వనం బక్కయ్య,శివరాత్రి పరశురాములు,మొగిలి పాక వేణు,తదితరులు పాల్గొని నివాళులర్పించారు.