ఆపరేషన్ సింధూర్ నేటి తో 1 సంవత్సరం పూర్తి
భారత్ తో పాక్ పెట్టుకుంటే కేవలం 2 రోజులలో ప్రపంచం చిత్ర పటం లో పాక్ లేకుండా చేసే సత్త మన సైన్యం కి ఉంది
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు S. రామచంద్రారెడ్డి
జోగులాంబ గద్వాల 7 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ... సరిగ్గా సంవత్సరం క్రితం భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా ధైర్యం కచ్చితత్వమైన సంకల్పంతో ఉగ్రవాదానికి సమాధానం ఇచ్చింది దేశాన్ని కుదిపేసిన పహల్గామలోని పిరికిపంద ఉగ్రదాడి అనంతరం భారతదేశం ఉగ్రవాదం యొక్క మూలాల మీద దెబ్బ కొట్టాలనే నిర్ణయించుకుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వంలో ఉగ్రవాదం మరియు దానికి మద్దతిచ్చే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సందేహం పంపడం జరిగింది
ఈ ఆపరేషన్ భారత సాయుధ దళాలు ధైర్యాన్ని ప్రదర్శించారు మిషన్లో స్వదేశీ రక్షణ సాంకేతికత ఆయుధాలు కీలక పాత్ర పోషించడంతో భారత్ యొక్క పెరుగుతున్న బలాన్ని కూడా చాటింది సంవత్సరం తర్వాత కూడా ఆపరేషన్ సింధూరం స్ఫూర్తి దేశానికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంది మన భద్రత దళాలు ధైర్యం త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ గర్వకారణంగా నిలుస్తాయి
ఈ కార్యక్రమం లో పట్టణం & మండలం అధ్యక్షులు తెలుగు నర్సింహా, గోపాలకృష్ణ నాయకులు లక్ష్మణ్ గౌడ్, ప్రతీప్ స్వామి, రాజశేఖర్, పులికల్ రాజశేఖర్, నర్సన్న గౌడ్, రామకృష్ణ, k.గోపాల్, శ్రీకాంత్, మల్లేష్, K.భీమన్న, వర్మ, శేషు తదితరులు పాలుగోన్నారు...