డ్రగ్స్ ,సైబర్ నేరాలపై అవగాహన
తిరుమలగిరి 08 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని వెలిశాల గ్రామం లో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన,షీ టీమ్స్ పైన పోలీసు కళాభృందంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై, వేసవికాలంలో ప్రజలందరూ తీసుకోవలసిన జాగ్రత్తల పైన, గంజాయి మత్తు పదార్థాలపై, షీ టీమ్స్ పై, పటిష్టంగా పనిచేస్తున్నమని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు,OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్, గౌడ్ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కోటయ్య, గ్రామ పోలీస్ అధికారి కానిస్టేబుల్ సైదులు, కళా బృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, చారి, గురులింగం సత్యం,చారి,కృష్ణ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.