హుబట్ నగర్–34, 46వ వార్డులను కలుపుతూ నాలాపై వంతెన నిర్మాణం
స్లాబ్ పనులు పూర్తి.. ప్రజల్లో హర్షం
సూర్యాపేట 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 34వ వార్డు హుబట్ నగర్ మరియు 46వ వార్డును కలుపుతూ నిర్మిస్తున్న నాలాపై వంతెనకు స్లాబ్ వేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 46వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దంతాల సాయి నవీన్ మాట్లాడుతూ, రెండు వార్డుల ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో నాలా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు దంతాల వీరయ్య, పెద్దపంగ సుధాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు జీడిమెట్ల రాంబాబు,తూముల సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అభివృద్ధి పనులు కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంలో మున్సిపాలిటీ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.