నూతన డిప్యూటీ తహాశీల్దార్ లకు పోలీసు అంశాలపై వారం రోజుల శిక్షణ.
ఎస్పి నరసింహ ని కలిసిన నలుగురు నూతన డిప్యూటీ తహశీల్దార్లు.
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.
బాధితుల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేయాలి.
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో కృషి చేయాలి
నరసింహ ఐపిఎస్ ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- నూతనంగా నియమితులైన డిప్యూటీ తాసిల్దార్లకు పోలీసు అంశాలపై శిక్షణ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం డిప్యూటీ తాసిల్దారులు ఈరోజు ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్ గారిని కలవడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ గారు డిప్యూటీ తాసిల్దారులకు సలహాలు సూచనలు తెలియజేశారు, వారం రోజులపాటు పోలీస్ అంశాలపై, చట్టాలపై, పోలీసులతో కలిసి పని చేయడం పై వారం రోజుల శిక్షణ ఉంటుందని ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని విధుల నిర్వహణపై పట్టు సాధించాలని కోరారు. మానవతా దృక్పథం అలవాటు చేసుకోవాలి, సంఘటనలు ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి, చట్టాన్ని -నిబంధనలను అమలు చేయడంలో నిష్పక్షపాతంగా ఉండాలి, బాధితుల పక్షాన పని చేయాలని కోరారు. తప్పులను మోసాలను ఉపేక్షించకూడదని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేయడంలో కృషి చేయాలి, మండల స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు తాసిల్దార్లకు ఉంటాయి వీటిని అమలు చేయడంలో నైపుణ్యం సాధించాలి అన్నారు. సమస్యలు సృష్టించే వ్యక్తులను మళ్లీ నేరాలకు పాల్పడతారు అనే అనుమానం ఉన్న వ్యక్తులను బైండోవర్ చేయడం, 144 సెక్షన్ అమలు చేయడం లాంటి జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయి వీటిని పోలీస్ శాఖ సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుంది అని తెలిపారు. భూ చట్టాలు, భూమి బదలాయింపులు అంశాలపై అవగాహన పెంచుకోవాలి. భూతగాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రజా జీవనాలకు ఆటంకం కలిగే విషయాల్లో సమన్వయంతో పనిచేయాలి పోలీసులతో భాగస్వామ్యంగా ఉండాలి అని సూచించారు.