అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే....
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంలో అంగన్వాడి టీచర్లకు మొబైల్స్ పంపిణీ...
జోగులాంబ గద్వాల 7 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రజా పాలన ప్రణాళిక 99 రోజులు భాగంలో అంగన్వాడి టీచర్లకు మొబైల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా గద్వాల నియోజకవర్గ అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు . ఎమ్మెల్యే కి అధికారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేయడం జరుగుతుందని అని తెలపారు. అంగన్వాడి టీచర్లు మొబైల్ ద్వారా అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న ప్రతి విషయంలో యాప్ లో అప్డేట్ చేయాలి. ఎంత మంది విద్యార్థులు అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్నారు వారికి పౌష్టికమైన ఆహారాలు ప్రభుత్వం నుండి వస్తున్న విషయాలు మరియు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు సరఫరా చేసి కూర్చున్న విషయాలను మొత్తం యాప్ లో నమోదు చేయాలి అని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో DWO సునంద, CDPO కీర్తి, హేమలత, జిల్లా అధ్యక్షురాలు ఇందిరమ్మ, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.