ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Dec 15, 2024 - 18:43
 0  1
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

తుంగతుర్తి డిసెంబర్ 14 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తునం అంజయ్య  (36) గత కొన్ని సంవత్సరాలుగా భార్య పిల్లలతో హైదరాబాదులో స్థిరపడ్డాడు. అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు. అతడికి ఇటీవల అప్పులతో పాటు కుటుంబ కలహాలు తోడు కావడంతో తన స్వగ్రామమైన గొట్టిపర్తి  గ్రామానికి వచ్చి తనకున్న వ్యవసాయ పొలంను అమ్మకానికి పెట్టాడు వ్యవసాయ పొలం కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో అప్పుల బాధతో బాధపడుతూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మరణించాడు మృతుడికి భార్య పిల్లలు కలరు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్మార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333