హత్యకేసులో 5 గురు నిందితుల అరెస్ట్

May 26, 2026 - 20:18
 0  0
హత్యకేసులో 5 గురు నిందితుల అరెస్ట్

•    12 గంటల్లోనే హంతకులను గుర్తించిన పోలీస్.
•    హత్య కు ఉపయొగించిన నాలుగు సెల్ ఫోన్లు, ఒక స్కూటర్, గొడ్డలి స్వాధీనం.

    సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు, నిందితుల అరస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు. భూమి సంబంధించి ఆస్తి సంబంధించి తగాదాలు ఉంటే ఇరు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టులను ఆశ్రయించి చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. భూమి సంబంధ తగాదాల విషయంలో ఓపికగా ఉండాలని ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ జీవితాన్ని జైలు పాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ గారు సూచించారు. భూమి సంబంధిత తగాదాల విషయంలో జరిగిన హత్యలలో నేరస్థులకు జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని తెలిపారు.

నిందితుల వివరములు:
 A-1. మేకల కిరణ్ S/o కృష్ణయ్య, వయసు: 35 సం.లు, వృత్తి : CISF కానిస్టేబుల్,     నివాసం: సోలిపేట  గ్రామము, సూర్యాపేట మండలము, 
A-2 మేకల మౌనిక W/o కిరణ్, వయసు: 34 సం.లు, వృత్తి : గృహిణి, నివాసం: సోలిపేట      గ్రామము, సూర్యాపేట మండలము,
A-3. మేకల కృష్ణయ్య S/o ముత్తయ్య,  వయసు: 63 సం.లు, వృత్తి : వ్యవసాయము,     నివాసము:  సోలిపేట  గ్రామము, సూర్యాపేట మండలము
 A-4. మేకల లక్ష్మమ్మ W/o కృష్ణయ్య , వయసు: 58 సం.లు, వృత్తి : గృహిణి, నివాసం:     సోలిపేట  గ్రామము, సూర్యాపేట మండలము,
A-5  మట్టపల్లి రామచంద్రు S/o శ్రీరాములు, వయసు: 52 సం. లు, వృత్తి: వ్యవసాయము,     నివాసం: సోలిపేట  గ్రామము, సూర్యాపేట మండలము,

    తేదీ 25.05.2026 సోమవారము  రోజున సూర్యాపేట రూరల్ పరిది సోలిపేట  గ్రామ శివారులోని జరిగిన మేకల జయరాములు  హత్య  కు సంబంధించి ఐదుగురు నిందితులను 12 గంటల్లోనే అరెస్ట్ చేయడం జరిగినది.

జయరాములు గతములో తన పిల్లల చదువుల నిమిత్తము సూర్యాపేటలో నివాసము ఉంటూ తనకు వారసత్వముగా వచ్చిన మూడు ఎకరముల  వ్యవసాయ భూమిని తన చిన్న అన్న ఏ3 నిందితుడు కృష్ణయ్య కు కౌలుకు సుమారు 12 సం. లు యిచ్చినాడు. పిల్లల చదువుల అనంతరము జయరాములు తన స్వంత గ్రామము అయిన సోలిపేటకు వెళ్ళి తన భూమిని తానే సాగు చేసుకుంటున్నాడు.  తనకు భూమి కౌలుకు ఇవ్వకుండా తానే స్వయంగా సాగుచేసుకుంటున్నాడు అని జయరాములు  చిన్న అన్న అయిన కృష్ణయ్య, అతని కుమారుడు కిరణ్ CISF కానిస్టేబుల్, కిరణ్ బార్య మౌనిక, కృష్ణయ్య బార్య లక్ష్మమ్మ, వ్యవసాయ భూమి గెట్టు విషయములో మృతునితో తరచూ గొడవ పెట్టుకుంటూ మరియు ఇండ్లు ప్రక్క ప్రక్కనే ఉన్నందున ఇంటి హద్దుల విషయములో కూడా వారు మరియు జయరాములు ఇంటికి మరో ప్రక్కన ఇల్లు గల మట్టపల్లి రామచంద్రు మృతుని కుటుంబముతో గోడవపడేవారు. వారం రోజుల క్రితము ఏ1 నిందితుడు కిరణ్  తన బార్య ఏ2 మౌనీకతో కలిసి సోలిపేటకు వచ్చి తన వ్యవసాయ భూమిలో నాలుగు రోజుల క్రితము బోర్ వేసి సోమవారం రోజు అనగా తేదీ 25.05.2026 న బోర్ కు మోటార్ ఫిట్ చేయించగా బోర్ నీళ్ళు బాగా పోసినందున బోర్ వద్దనే కిరణ్, అతని తల్లి తండ్రులు ఏ3 కృష్ణయ్య, ఏ4 లక్ష్మమ్మ, తన బార్య మౌనిక మరియు ఏ5 రామచంద్రు లు కలిసి దావత్ చేసుకున్నారు. అట్టి సమయములో జయరాములు అక్కడికి వెళ్ళి తన వ్యవసాయ పొలములో వరి కొయ్యకాళ్ళకు నిప్పు పెట్టి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయినాడు. ఆ సమయములో నిందితులు అతన్ని చూసి జయరాములు తరచూ తమతో గోడవపడుచు ఇబ్బందులు పెట్టుచున్నాడు అతన్ని చంపినచో అడ్డము ఎవరు ఉండరు, అతన్ని ఎలాగాయిన ఈ రోజు చంపుదాము అని నిర్ణయించుకొని పథకము పన్నినారు. కొద్దిసేపటి తర్వాత అక్కడినుండి కృష్ణయ్య, లక్ష్మమ్మ లు ఇంటికి వెళ్లిపోయినారు, వారు వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రు, కిరణ్, మౌనీకలతో సాయంత్రము జయరాములు వరి కొయ్యకాళ్ళ నిప్పు ఆర్పడానికి  మళ్ళీ పొలము  వస్తాడు, అదును చూసి అప్పుడు చంపుదాము అతను రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పి రామచంద్రు ఇంటికి వెళ్ళిపోతాడు. సాయంత్రము సుమారు 6 గంటల సమయములో జయరాములు తిరిగి తన వ్యవసాయ పొలము వద్దకు వెళ్ళి  కొద్దిసేపు అక్కడ ఉండగా ఇది గమంచిన కిరణ్ అతని బార్య మౌనిక జయరాములు చంపాలని రామచందరుకు ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కిరణ్, మౌనిక లు గొడ్డలి తీసుకొని వారి స్కూటర్ పై ముందుగా వెళ్ళి గ్రామ ఆర్చీ వద్ద కాపు కాసి ఉండగా రాత్రి సుమారు 7 గంటల సమయములో జయరాములు తన మోటార్ సైకిల్ పై ఇంటికి వెల్లుచు ఆర్చీ వద్దకు రాగానే కిరణ్, మౌనిక కలిసి అతన్ని అడ్డగించి అతనితో గోడవపడి కిరణ్ తన చేతిలో ఉన్న గొడ్డలితో జయరాములు మెడ, తల, చేతులు మరియు ఇతరచోట్ల యిష్టము వచ్చినట్లు నరకగా తీవ్ర గాయాలతో జయరాములు అక్కడికి అక్కడే చనిపోగా వెంటనే నేరస్తులు ఇద్దరు ఇంటికి వెళ్ళి కిరణ్ తల్లితండ్రులకు మరియు రామచంద్రుకు  జయరాములు ను హత్య చేసిన విషయము చెప్పి  వెంటనే అందరూ కలిసి ఆటో కిరాయికి మాట్లాడుకొని ఊరి నుండి పారిపోయినారు. 

    ఇట్టి కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి సూర్యాపేట రూరల్  ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట లోని హైటెక్ బస్ స్టాండ్ వద్ద నెరస్థులను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. విచారంలో భాగంగా భూమి గెట్టు తగాదా మనసులో పెట్టుకొని హత్య చేసినట్లు నేరస్తులు వారి నేరాన్ని అంగీకరించినారు. 
    వీరి నుండి ఒక స్కూటర్,  నాలుగు సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకోవడం జరిగినది. 

నిందితుల గత నేర చరిత్ర ఏమి లేదు.

    కేసును అన్ని కోణాల్లో పటిష్టంగా దర్యాప్తు చేసి హంతకులకు త్వరితగతిన శిక్షలు పడేలాగా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ఎవరైనా చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతూ భౌతిక దాడులకు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని ఎస్ పి హెచ్చరించారు. భూమి సంబంధించి ఆస్తి సంబంధించి తగాదాలు ఉంటే ఇరు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టులను ఆశ్రయించి చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. భూమి సంబంధ తగాదాల విషయంలో ఓపికగా ఉండాలని ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ జీవితాన్ని జైలు పాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ గారు సూచించారు. భూమి సంబంధిత తగాదాల విషయంలో జరిగిన హత్యలలో నేరస్థులకు జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని తెలిపారు.

    ఈ కేసులో బాగా పనిచేసి పర్యవేక్షణ చేసిన సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ ను, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై బాలు నాయక్,  సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బందిని  అభినందించడం జరిగింది.

ఈ మీడియా సమావేశం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సిఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333