రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి జిల్లా కలెక్టర్

May 26, 2026 - 22:26
 0  3
రైతులకు  ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి జిల్లా కలెక్టర్

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

 తిరుమలగిరి 27 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. తిరుమలగిరి మండలాల్లోని ఇటూరు గ్రామంలో సోమేశ్వర రైస్ మిల్ ఇండస్ట్రీ, వ్యవసాయ మార్కెట్, పారా రైస్ మిల్, తాటిపాముల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆన్ లోడింగ్ చేయాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ మోహన్ బాబు, డిఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, తహసిల్దార్ హరిప్రసాద్, రైస్ మిల్లర్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు....

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి