స్మశానానికి దారి కరువు
స్మశానానికి దారి కరువు
వెంగళరావు పేట గ్రామంలో ప్రజల అవస్థలు
తెలంగాణ వార్త (నుగూరు)వెంకటాపురం, ఫిబ్రవరి 23: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంగళరావుపేట గ్రామంలో ఎవరైన మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం ఉప్పెడు పాయకి తీసుకు వెళ్తుంటారు కానీ ప్రస్తుతం ఉప్పెడు పాయకు వెంగళరావుపేట గ్రామస్తులు వెళ్లడానికి దారి లేకుండా మిరప తోటలని అక్కడి రైతులు పండిస్తున్నారు. ఎవరైనా మృతి చెందితే ఉప్పెడు పాయకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తారు.గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ అధికారులు వారి ఇబ్బందిని అర్థం చేసుకొని వారికి దారి ఇవ్వాలని అక్కడి రైతులని ఆదేశించారు కానీ ప్రస్తుతం అక్కడే పంటలు పండిస్తున్న రైతులు పూర్తిగా దారి లేకుండా పోవడంతో స్మశానానికి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇరుకు గట్లపై మృతదేహాలను మోసుకువెళ్లడం వారికి కష్టంగా ఉంది ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే వారి యొక్క ఇబ్బందిని అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తీర్చాలని వెంగళరావుపేట గ్రామస్తులు పత్రికాముఖంగా కోరుకుంటున్నారు.