పోగొట్టుకున్న పర్సును బాధితురాలికి అందజేసిన సూర్యాపేట పోలీసులు

Jul 12, 2026 - 00:00
 0  3
పోగొట్టుకున్న పర్సును బాధితురాలికి అందజేసిన సూర్యాపేట పోలీసులు

సూర్యాపేట జిల్లా కేంద్రం మానవత్వంతో స్పందిస్తూ, బాధితురాలు పోగొట్టుకున్న పర్సును తిరిగి అందజేసి సూర్యాపేట పోలీసులు తమ సేవా భావాన్ని చాటుకున్నారు. చిలుకూరు మండలం, కోదాడకు చెందిన షేక్ కళ్యాణి (45), భర్త కాజా ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కిందపడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ హడావుడిలో ఆయన భార్య కళ్యాణి వద్ద ఉన్న ఓప్పో మొబైల్ ఫోన్, రూ.4,270 నగదు ఉన్న పర్సు బస్టాండ్ ప్రాంతంలో పోగొట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన బస్టాండ్ కంట్రోలర్ చెరుకు వెంకటయ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సూర్యాపేట సిఐ వెంకటయ్య, ఆధ్వర్యంలో ఎస్సై గోపీకృష్ణ,  పోలీసు సిబ్బంది ఎండి అఫ్సర్, రవి, లింగయ్య, రమణ, కలిసి పర్సును భద్రపరిచి బాధితురాలు షేక్ కళ్యాణి,కి అప్పగించారు. తమ విలువైన వస్తువులు సురక్షితంగా తిరిగి అందడంతో బాధితురాలు పోలీసులకు, బస్టాండ్ కంట్రోలర్ చెరుకు వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సూర్యాపేట పోలీసుల సేవలను అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333