పేరుకు మాత్రమే నీళ్ల ట్యాంకు విద్యార్థులకు తప్పని  తిప్పలు

Jul 11, 2026 - 23:49
Jul 11, 2026 - 23:55
 0  1
పేరుకు మాత్రమే నీళ్ల ట్యాంకు విద్యార్థులకు తప్పని  తిప్పలు
పేరుకు మాత్రమే నీళ్ల ట్యాంకు విద్యార్థులకు తప్పని  తిప్పలు

జోగులాంబ గద్వాల 11 జులై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  మండలం బుడ్డారెడ్డిపల్లి గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలకు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు మంచినీళ్ల ట్యాంకు మంజూరు అయింది. పనులు కూడా పూర్తి కావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ విద్యార్థిని విద్యార్థులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ తాగునీటి అవసరాల కోసం కనీస వసతులైన కుళాయిలు ఏర్పాటు చేయలేదు. అలాగే సాతర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 54 మంది విద్యార్థినిలు 37 మంది పాఠశాలలోవిద్యను అభ్యసించుచున్నారు. ఈ పాఠశాలలో రెగ్యులర్ టీచర్లు ముగ్గురు కాగా, డిప్యూటేషన్ పై నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. హిందీ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నదనీ ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. అలాగే మిగతా సబ్జెక్టుల వారు డిప్యుటేషన్ వై వివిధ గ్రామాల నుండి వచ్చి వారంలో రెండు రోజులు హిందీ సబ్జెక్టును బోధించడం జరుగుతుందనీ ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు త్రాగు నీటి బిందెలతో విద్యార్థులకు భోజనం అనంతరం గ్లాస్ లు, బాటిల్లతో  నీళ్లు పోయడం జరుగుతుందని కనుక విద్యార్థులతీవ్ర ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు చొరవ తీసుకొని విద్యార్థుల సమస్యను పరిష్కరించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులతల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State