తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాం

Jul 11, 2026 - 23:58
 0  1
తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాం

 ఇప్పటివరకు 11 వేల కోట్ల వరకు ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయి

 ప్రతి గ్రామానికి RTC బస్సులు నడపాలనేది ప్రభుత్వ లక్ష్యం

రాష్ట రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

.తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని రాష్ట రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుజుర్నగర్ లో 3.52 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న బస్సు  స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఆహార  పౌరసరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 3.52 కోట్ల రూపాయలతో  బస్సు స్టేషన్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, తెలంగాణ వ్యాప్తంగా 10,173 ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని, 35 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ద్వారా ఇప్పటివరకు 326 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని,  మహిళలకు  11,400 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూర్చామని  అన్నారు. మహిళా సంఘాలకు 600 బస్సులను అందించి ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

తదుపరి ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యంతో పాటు, మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. హుజూర్‌నగర్‌ లో బస్టాండ్  నిర్మాణంతో ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పెరిక కార్పొరేషన్ చైర్మన్  దొంగరి వెంకటేశ్వర్లు,మున్సిపల్ చైర్మన్ దొంతగాని  శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా, మున్సిపల్  వైస్ చైర్మన్ మల్లికార్జున్,  ఆర్డీవో శ్రీనివాసులు, తాసిల్దార్ కవిత పట్టణ ప్రజలు తదితరులు అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333