జిల్లా ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్ సరఫరా – రేడియాలజీ సేవలు అందక రోగుల తీవ్ర ఇబ్బందులు

Jul 11, 2026 - 23:54
Jul 11, 2026 - 23:54
 0  1

జోగుళాంబ గద్వాల 11 జులై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రిలోని 'రేడియాలజీ హబ్' లో ఉదయం నుండి కరెంట్ లేకపోవడంతో ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​రోగుల కుటుంబ సభ్యుల ఆరోపణలు: ​జనరేటర్ ఉన్నా ఆన్ చేయని వైనం: అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది దానిని ఆన్ చేసి స్కానింగ్ ప్రక్రియను కొనసాగించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​టెక్నిషియన్ల నిరాకరణ: ఉదయం నుండి విద్యుత్ లేదనే నెపంతో టెక్నిషియన్లు స్కానింగ్ చేయడానికి నిరాకరిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రేడియాలజీ సేవలను పునరుద్ధరించాలని, పేద రోగులకు ఇబ్బంది కలగకుండా రోగుల బందువులు విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333