మీ కంచంలో అన్నం చూసిన ప్రతిసారీ మీరు చేతులెత్తి దండం పెట్టాల్సిన ఒకే ఒక్క నాయకుడు.. చరిత్ర మర్చిపోయిన దేవుడితను

Jul 11, 2026 - 20:35
 0  1
మీ కంచంలో అన్నం చూసిన ప్రతిసారీ మీరు చేతులెత్తి దండం పెట్టాల్సిన ఒకే ఒక్క నాయకుడు.. చరిత్ర మర్చిపోయిన దేవుడితను

ఒకసారి కళ్లు మూసుకుని 1960ల కాలం నాటి మన భారతదేశాన్ని ఊహించుకోండి. అప్పట్లో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే... దేశంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. జనాలు తినడానికి సరైన తిండి లేదు. అమెరికా వాళ్ళు దయతలిచి పంపించే పశువులు తినే ఎర్ర గోధుమల (PL-480) కోసం మనం ఎదురుచూసేవాళ్లం. వాళ్ల ఓడలు మన రేవులకు వస్తేనే మన దేశంలో పొయ్యి వెలిగేది. ఆ ఓడలు రావడం ఒక్క వారం లేట్ అయినా సరే, ఇక్కడ లక్షలాది మంది ఆకలితో చనిపోయే పరిస్థితి. దాన్ని అప్పట్లో 'షిప్-టు-మౌత్ (Ship-to-mouth)' బతుకులు అనేవాళ్ళు. కడుపు నిండా అన్నం తినడం అనేది ఒక విలాసంగా మారిపోయిన ఆ చీకటి రోజుల్లో, ఈ దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకాయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయనే సి. సుబ్రహ్మణ్యం.

ఈరోజు మన ఇంట్లో మూడు పూటలా అన్నం ఉడుకుతోంది అన్నా, ఆన్లైన్ లో ఆర్డర్ చేయగానే అరగంటలో బిర్యానీలు ఇంటికి వస్తున్నాయి అన్నా... దానికి కారణం నాడు ఆయన చేసిన పోరాటమే!

అప్పట్లో డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్ లాంటి సైంటిస్టులు మెక్సికో నుండి ఒక కొత్త రకం పొట్టి గోధుమ విత్తనాలను (Mexican dwarf wheat) తీసుకువచ్చారు. ఇవి వాడితే మన భూముల్లో మూడింతలు ఎక్కువ పంట పండుతుందని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే... మన దేశంలో ఎవరూ వాళ్ల మాట నమ్మలేదు. ఈ విదేశీ విత్తనాలు వాడితే మన భూములు నాశనం అయిపోతాయని రైతులు భయపడ్డారు. ప్రతిపక్ష నాయకులు, ఆర్థిక శాఖ అధికారులు, చివరికి తోటి మంత్రులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. "ఇదంతా అమెరికా వాళ్ల కుట్ర, ఆ విత్తనాలు వద్దు" అని గొడవ చేశారు.

ఆయన ప్లేస్ లో వేరే ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ అని ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంటాడు. కానీ సుబ్రహ్మణ్యం గారు అలా చేయలేదు. తనను వ్యతిరేకించిన వాళ్ళందరి ఆశ్చర్య పరిచేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. తన సొంతానికి ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన పెద్ద బంగ్లా ముందున్న అందమైన పచ్చటి లాన్ (Lawn) మొత్తాన్ని ట్రాక్టర్ పెట్టి దున్నించేశారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి, తన ఇంటి ఆవరణలోనే మట్టిలో దిగి స్వయంగా ఆ కొత్త రకం విత్తనాలు నాటారు. తన సొంత ఇంటినే ఒక ప్రయోగశాలగా, తనను తాను ఒక రైతుగా మార్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత చూస్తే, ఆ విత్తనాల వల్ల అద్భుతమైన దిగుబడి వచ్చింది. అది కళ్లారా చూశాకే దేశంలోని రైతులు, అధికారులు "ఇది నిజంగానే పనిచేస్తుందని" అని నమ్మారు.

సైంటిస్టులు ల్యాబ్ లో విత్తనాలు కనిపెట్టడం ఎంత గొప్ప విషయమో, ఆ విత్తనాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఒక రాజకీయ నాయకుడు తన పదవిని పణంగా పెట్టి ఇంతటి రిస్క్ తీసుకోవడం కూడా అంతే గొప్ప విషయం.

ఆ ప్రయోగం సక్సెస్ అయ్యాక, ఆయన ఎవరి మాట వినలేదు. ఎంతో ధైర్యంగా మెక్సికో నుండి ఏకంగా 18,000 టన్నుల కొత్త విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. ఆరోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఎంత రిస్క్ అంటే.. ఒకవేళ ఆ విత్తనాలు ఫెయిల్ అయితే ఆయన రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోతుంది, దేశంలో కోట్లాది మంది ఆకలితో చచ్చిపోతారు. కానీ ఆయన తన పదవి కోసం భయపడలేదు, తన దేశ ప్రజల ఆకలిని తీర్చడం కోసమే ఆలోచించారు. అంతటితో ఆయన ఆగలేదు. రైతులు పండించిన పంటకు సరైన ధర రాకపోతే వాళ్ళు నష్టపోతారని ఆలోచించి, చరిత్రలో మొట్టమొదటిసారిగా 'కనీస మద్దతు ధర (MSP - Minimum Support Price)' అనే సిస్టమ్ ను తీసుకువచ్చింది కూడా ఈయనే. రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేయడానికి 'ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (FCI) ని స్థాపించింది కూడా ఆయన హయాంలోనే. ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్న రెండేళ్లలోనే దేశంలో అద్భుతం జరిగింది.

అప్పటిదాకా కేవలం 10 నుండి 12 మిలియన్ టన్నులు పండే మన గోధుమ దిగుబడి, 1968 నాటికి ఏకంగా 17 మిలియన్ టన్నులకు పైగా పెరిగిపోయింది. ఈరోజు మనం ఏకంగా 110 మిలియన్ టన్నులకు పైగా గోధుమలు పండిస్తూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నాం. వేరే దేశాల దగ్గర అడుక్కునే స్థాయి నుండి, వేరే దేశాలకు మనం ఆహారం ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగింది. దీనినే మనం 'హరిత విప్లవం (Green Revolution)' అంటాం. ఈ విప్లవానికి ఎం.ఎస్. స్వామినాథన్ గారు సృష్టికర్త అయితే, దానికి రాజకీయంగా ప్రాణం పోసింది మాత్రం సి. సుబ్రహ్మణ్యం గారే!

ఈరోజు మన యువత ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు. కానీ సుబ్రహ్మణ్యం గారి జీవితం చూడండి... 50 కోట్ల మంది ఆకలి కేకలు ఒకవైపు, దారుణంగా విమర్శిస్తున్న రాజకీయ నాయకులు మరోవైపు. ఆ భయంకరమైన ఒత్తిడిలో కూడా ఆయన ఎంత ప్రశాంతంగా, ఎంత తెగువతో నిర్ణయాలు తీసుకున్నారో కదా!

తనను విమర్శించిన వాళ్ళ మీద ఆయన కోప్పడలేదు, వాళ్ళతో మాటల యుద్ధం చేయలేదు. తన చేతలతో, రిజల్ట్స్ తో సమాధానం చెప్పారు. సొంత లాభం కోసం కాకుండా, పది మందికి మేలు జరిగే పని చేస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలబడినా సరే భయపడకూడదు అని ఆయన జీవితం మనకు నేర్పుతోంది.

చివరిగా ఒక మాట... మనం రోజు తినే ప్రతి మెతుకు మీద రైతన్న పేరు రాసి ఉంటుందో లేదో తెలియదు కానీ, మనం కడుపు నిండా తింటున్నామంటే మాత్రం ఆ పళ్ళెంలో సి. సుబ్రహ్మణ్యం గారి ప్రయత్నం కచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే భారత ప్రభుత్వం 1998లో ఈ అజ్ఞాత హీరోని దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'తో సత్కరించింది. చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు మాత్రమే కాదు... ఒక దేశ ప్రజల ఆకలి తీర్చిన ఇలాంటి మహానుభావుల కృషి కూడా!
References:
1 Frontline.Thehindu - A visionary and a statesman
A visionary and a statesman
Arts & Culture News: A visionary and a statesman
https:/frontline.thehindu.com/arts-and-culture article30161011.ece
2 Wikipedia - Chidambaram Subramaniam
Chidambaram Subramaniam - Wikipedia
About his contribution, Dr. Norman E. Borlaug , writes: [ 1 ] The vision and influence of Mr. Subramaniam in bringing about agricultural change and in the very necessary political decisions needed to make the new approach effective, should never be under-emphasized. The groundwork for this advance (in the production of wheat) was solidly laid during that period (1964–67)https://en.wikipedia.org/wikiChidambaram_Subramaniam Better known as CS)✌️joy*  Vజయ్ విజయ్

వాట్సప్ సేకరణ
  .. వంగవీటి బీజేపీ కోదాడ
       9848993492

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333