ఆర్టీసీని ఇంకా బలోపేతం చేస్తాం

Jul 12, 2026 - 00:08
 0  2
ఆర్టీసీని ఇంకా బలోపేతం చేస్తాం
ఆర్టీసీని ఇంకా బలోపేతం చేస్తాం

 ప్రతి గ్రామానికి RTC బస్సులు నడపాలనేది ప్రభుత్వ లక్ష్యం

 తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాం

రాష్ట రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

.తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని రాష్ట రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కోదాడ లో 16.92 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న నూతన బస్సు డిపో, బస్సు స్టేషన్ నిర్మాణాలకు రాష్ట్ర ఆహార  పౌరసరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు ఉత్తం పద్మావతి రెడ్డి  తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 16.92 కోట్లతో  బస్సు స్టేషన్, డిపో నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి బస్ స్టేషన్ నిర్మాణం చేయటం  కోదాడ కే దక్కినదని, కోదాడ ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నందున ఆంధ్ర నుండి తెలంగాణలోకి ప్రవేశించిన తరువాత మొట్టమొదటి బస్టాండ్ ఇదేనని అందుకొరకు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆధునిక టెక్నాలజీతో అన్ని హంగులతో నిర్మించడం జరుగుతుందని అలాగే తెలంగాణ వ్యాప్తంగా 10,173 ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని, 35 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ద్వారా ఇప్పటివరకు 326 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని, ఉచిత ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటివరకు  11,400 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినదని  అన్నారు. మహిళా సంఘాలకు 600 బస్సులను అందించి ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులకు కూడ చాలాకాలం పెండింగ్లో ఉన్న  ఫిట్మెంట్, డిఎ మంజూరు చేశామని కార్మికులకు అన్ని విధాల ఆదుకుంటామని, కొత్తగా 3,500  పోస్టులను భర్తీ చేశామని, 250 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగినదని, కొత్తగా 2,500 బస్సులు కొన్నామని,   కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యంతో పాటు, మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 
కోదాడ బస్సు స్టాండ్, డిపో నిర్మాణంతో ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. కోదాడలో 26 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని, కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో పేద ప్రజల కొరకు 2.5 కోట్లతో సిటీ స్కాన్ మిషన్, అలాగే కిడ్నీ రోగుల కొరకు డయాలసిస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని 50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, చిలుకూరులో  250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం చేపడుతున్నామని, రాబోవు రోజులలో కోదాడ నియోజకవర్గాన్ని రాష్టములో అగ్రగామి నియోజకవర్గముగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.
   తదుపరి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ  కోదాడ బస్టాండు డిపో నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బస్టాండ్ నిర్మాణంలో ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా ముందు వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడతామని వీటి ద్వారా ఆర్టీసీకి ఆదాయం  సమకూరుతుందని  అన్నారు.
           ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ మాజీ శాసనసభ్యులు చందర్రావు, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం, మున్సిపల్ కమీషనర్ రమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ,  
 పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333