సేవ్ ద సేవియర్స్ సేవ్ ద డాక్టర్స్ సూర్యాపేట లో నినదించిన జూనియర్ డాక్టర్ లు
కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యచారం,దారుణ హత్యను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్ లు, మెడికోలు గళమెత్తారు.... ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని, డాక్టర్ లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలిగా తరలివచ్చి కోర్టు చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ లు మాట్లాడుతూ వైద్యులు పనిచేసే ఆసుపత్రుల వద్ద రక్షణ కల్పించాలని అన్నారు. మహిళలపై అత్యాచారాలు ఆపండి. Enough is enough అంటూ నినాదాలు చేశారు. మహిళల పై జరుగుతున్న అత్యాచారాలపై పౌర సమాజం స్పందించాలని, మౌనంగా వుంటె మరిన్ని దారుణాలు జరుగుతాయని మహిళా వైద్యలు అన్నారు. మెడికల్ కాలేజ్ ల సంఖ్య పెంచడం కాదు.... రక్షణ పెంచాలని వారు నినదించారు... ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో జూనియర్ డాక్టర్ లు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, స్ధానిక వైద్యులు పాల్గొన్నారు.....