ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి లో జిల్లా ప్రజలు సభ్యత్వం తీసుకోవాలి
బిజెపి సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు
సభ్యత్వం నమోదు కోసం 8800 00 2024 కు మిస్ డ్ కాల్ చేయాలి
సూర్యాపేట టౌన్ 6 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ లో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కోసం 8800 00 2024 నంబర్ కు మిస్ డ్ కాల్ చేయాలని అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలోని బిజెపి కార్యాలయం నందు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ హబీద్ కు పార్టీ సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతుందని, సెప్టెంబరు ఒకటవ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్ లైన్ లో మొదటి సభ్యత్వం తీసుకున్నారని, ఆన్ లైన్ లో బిజెపి సభ్యత్వం నమోదు ప్రక్రియ లో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని పార్టీ కి మద్దతు ఇవ్వాలని అన్నారు. దేశభక్తి , జాతీయ వాద భావజాలంతో భారత్ ను నరేంద్ర మోడీ శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. తెలంగాణ లో గతంలో పరిపాలించిన బిఆర్ ఎస్ పార్టీ అవినీతిలో కూరుకు పోయిందని, బిఆర్ ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయడం లేదని, మహిళలకు ఇచ్చిన హామిలు విస్మరించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.