ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ఆధ్యాత్మికతకు భానుపురి పెట్టింది పేరు

Mar 8, 2024 - 19:51
 0  8
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

 ఘనంగా భద్రకాళి సహిత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం*హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఆధ్యాత్మికతతోనే మనసుకు ప్రశాంతత కలుగుతుందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని వీరభద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో ప్రజల కులమతాలకు అతీతంగా ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో పండుగలు ఉత్సవాలు నిర్వహించుకోవడం హర్షినియమన్నారు.

 గత కొన్నేళ్లుగా శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్న కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కళ్యాణ్ ఉత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు ఆయన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. *అనంతరం కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదాన వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు కేక్కిరేని శ్రీనివాస్,  ఎలిమినేటి అభినయ్, ఎస్.కె జహీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,  అయా వార్డుల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333