కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలి

సూర్యాపేట(సిటీ) : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఏఐసీసీ మాజీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌజ్‌లో చివ్వెంల మండలం మోదిన్‌పురంకు చెందిన సుమారు 27 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీలో చేరిన వారిలో వీరప్ప, వెంకన్న, జాను, సుధాకర్, రామలింగం, రాములు, శ్రీను, గిరి, అంజయ్య, వేణు, బిక్షం, సైదులు, జయమ్మ, కనకమ్మ, లక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ సెక్రట్రీ కొప్పుల వేణారెడ్డి, నాయకులు ధరావత్ వీరన్న నాయక్, సగరపు ప్రసాద్, చత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.