వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

Apr 8, 2025 - 19:46
Apr 8, 2025 - 19:54
 0  2
వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

*ఈనెల 27న వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి*

- అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా తరలిరావాలి 

* ఉద్యమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేసిన కెసిఆర్ 

* ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్య చరణకు దిశా నిర్దేశం చేయనున్న అధినేత 

* వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ 

భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్షలాదిమందితో నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కెసిఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యచరణకు దిశ నిర్దేశం చేస్తారని తెలిపారు. ప్రతి గ్రామము నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భాగస్వామ్యమై సభలో పాల్గొనేలా నాయకులు కృషి చేయాలన్నారు. గతంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని చరిత్ర బిఆర్ఎస్కు ఉందని 14ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ చేశాడన్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు నీటి తిరువ రద్దు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, బీసీ బందు, దళిత బంధుతో పాటు మత్స్యకారులకు చాపల పంపిణీ, యాదవులకు గొర్రెల పంపిణీ చేసి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానాయకుడు కేసిఆర్ అని అన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లడంతో ప్రజావ్యతిరేక పాలన సాగుతుందన్నారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారని కెసిఆర్ వల్లనే మాకు మేలు జరిగిందని చెప్పుకొస్తున్నారని అన్నారు. ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 26వేల మందిని తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు రైతులు, కార్మికులు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, జిల్లా బిఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, నాయకులు ఉప్పల సైదులు, బుడిగ నవీన్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333