సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో చేర్చి స్టేషన్ ఏర్పాటు చేయాలి.
సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో చేర్చి స్టేషన్ ఏర్పాటు చేయాలి.
సూర్యాపేట కలెక్టరేట్ ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా....
కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన నేతలు.....
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేంతవరకు ఉద్యమాలు ఉదృతం చేస్తాం...
అఖిలపక్ష నేతల డిమాండ్
సూర్యాపేట కలెక్టరేట్ :హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను మళ్లీ చేర్చి, సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం జాతీయ రహదారి–65పై ఉన్న ప్రధాన వాణిజ్య పట్టణమని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రజలకు కీలక రవాణా కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. వరి, పత్తి, ఎర్ర మిరప, జొన్న వంటి పంటల ఉత్పత్తి, పార్‌బాయిల్డ్ రైస్ మిల్లులు, విద్యా మరియు పారిశ్రామిక సంస్థలతో సూర్యాపేట ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు.
గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, ప్రస్తుతం పరిశీలిస్తున్న మూడో అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను తొలగించడం సూర్యాపేట జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాలో గత 20 సంవత్సరాలుగా రైల్వే మార్గం కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రాకుంటే సూర్యాపేట జిల్లా అందాకారంలోకి నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా రైల్వే సౌకర్యం కోసం చిరకాలంగా సూర్యాపేట ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, సూర్యాపేట ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేల సిఫారసు చేయాలని నాయకులు కోరారు. సూర్యాపేటకు రైల్వే సౌకర్యం కల్పించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి, అఖిలపక్ష పార్టీల నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, మల్లు నాగార్జున రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, మండారి డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్, తుక్కాని మన్మధ రెడ్డి, పెద్దిరెడ్డి రాజా, అనుముల రవిబాబు, నూకల సుదర్శన్ రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బండపల్లి పాండురంగ చారి, చల్ల మల్ల నరసింహ, తల్ల మల్ల హసేన్, రమణాచారి, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, బూర వెంకటేశ్వర్లు, కునుకుంట్ల సైదులు, పోలే బోయిన కిరణ్, పేర్ల నాగయ్య, నల్లెడ మాధవరెడ్డి, బుద్ధ సత్యనారాయణ, గుండాల సందీప్, ధనియాకుల శ్రీకాంత్, పుల్లూరి సింహాద్రి,పిడమర్తి భరత్, ఎస్.కె అబ్దుల్ కరీం, కె యోగానంద చార్యులు, జి కోటయ్య, సట్టు నాగయ్య, నవిలే ఉపేందర్,దూలం నగేష్, చెరుకు యాక లక్ష్మి, తంగుళ్ల జనార్ధన్, వేల్పుల వెంకన్న, ఎల్గూరి గోవింద్, పి మహేష్, దాసరి వెంకన్న యాదవ్, ధరావత్ రవి నాయక్, కోడి లింగయ్య యాదవ్, మేరెడ్డి కృష్ణారెడ్డి, దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.