టేకుమట్ల శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి ఆలయ అభివృద్దికి కృషి చేస్తాను

వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్త

Jun 16, 2026 - 16:38
Jun 16, 2026 - 16:47
 0  0
టేకుమట్ల శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి ఆలయ అభివృద్దికి కృషి చేస్తాను

టేకుమట్ల 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  టేకుమట్ల శ్రీ లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి పెద్దమ్మతల్లి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్త అన్నారు.  మంగళవారం ఆయన చౌడమ్మ తల్లి లింగమంతుల స్వామి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించారు . ఆలయ కమిటీ సభ్యులు గట్టు శ్రీనివాస్ గుప్త కు  సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి,  చౌడమ్మ తల్లి  జాతరకు టేకుమట్ల గ్రామం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి చుట్టుపక్కల మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న యాదవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. లింగమంతుల స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం పాడి పంటలతో అభివృద్ది చెందాలని అన్నారు. ఆలయం వద్ద నీటి కొరత లేకుండా వుండడం కోసం దాతల సహకారంతో గతంలోనే ఇక్కడ వాటర్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగిందని ఆయన అన్నారు.  ఆలయ అభివృద్ధి కోసం, మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో  ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాల మాణిక్యం, జాల జానకి రాములు, లొడంగి సోమయ్య,  జాల వెంకన్న, జాల నరసయ్య, జాల జానయ్య, జాల సైదులు, గ్రామ వార్డు మెంబర్ లు దాసరి శ్రీనివాస్, కాంపాటి రమేష్, దాసరి నర్సయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు   పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333