సూర్యాపేట వాసి డాక్టర్ రఘువరన్ ఆచార్యులుకు ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు 2024కు ఎంపిక

Mar 13, 2024 - 20:20
 0  7
సూర్యాపేట వాసి డాక్టర్ రఘువరన్ ఆచార్యులుకు ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు 2024కు ఎంపిక

సూర్యాపేట,మార్చి 12:సామాజిక వేత్త ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో 2024 సంవత్సరం గాను హైదరాబాద్ ముషీరాబాద్ నందు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సిటీ కల్చలర్ సెంటర్ ఆడిటోరియంలో ఈ నెల 24వ తేదిన నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో సూర్యాపేట నివాసి డాక్టర్ రఘువరన్ ఆచార్యులుకు ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషన్ అవార్డ్ ప్రధానం చేస్తున్నాం అని ఆ సంస్థ అధినేత డాక్టర్ లయన్ ఆకుల రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ ఆకుల రమేష్ మాట్లాడుతూ సామాజిక ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమందికి సహాయం చేయాలనే దృడ సంకల్పంతో ముందుకు సాగుతూ ఒక ఆలయ పూజారిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఇటు మీడియా రంగంలో తన దైన శైలిలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ విభిన్న కార్యక్రమాలు చేస్తూ పలువురుచే ప్రశంశలు అందుకుంటూ అనతి కాలంలోనే డాక్టరేట్ పొందిన ఘనత రఘువరన్ ఆచార్యులు దక్కింది.ఎటువంటి సేవా తత్పరులను సన్మనిoచటం మా సంస్థకు గర్వకారణం అని ఆకుల రమేష్ పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదయ్య గౌడ్, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్, డాక్టర్ జి నరసింహారావు,డాక్టర్ ఆర్ఎస్ కుమార్, డాక్టర్ వల్లం భారత్, చేతుల మీదుగా ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333