సూర్యాపేట లో మెడికల్ ఎగ్జిబిషన్

Nov 1, 2025 - 01:17
Nov 1, 2025 - 01:19
 0  7
సూర్యాపేట లో మెడికల్ ఎగ్జిబిషన్

*3,4 తేదీల్లో మెడికల్ ఎగ్జిబిషన్*

*వైద్యరంగంపై అవగాహన గురించి ఏర్పాటు చేసే మెడికల్ ఎగ్జిబిషన్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి* 

*సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలత

నవంబర్ మూడు,నాలుగు తేదీలలో సూర్యాపేట మెడికల్ కళాశాలలో నిర్వహించే మెడికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జయలత శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఈ మెడికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సూర్యాపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు హాజరుకావాలని ఆమె ఆహ్వానించారు. మెడికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ కొత్తపల్లి లు హాజరవుతారని ఆమె వెల్లడించారు. నవంబర్ సోమవారం,మంగళవారం ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రాక్టికల్ వర్క్ షాపులు, ప్రాథమిక చికిత్స, సూచరింగ్, శరీర నిర్మాణ నమూనాలపై శిక్షణ, క్లినికల్ ప్రదర్శనలు, వివిధ వైద్య విభాగాలైన సర్జరీ, అనాటమీ, ఫాథాలజీ ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన ఉంటాయని తెలిపారు. దీంతోపాటు వైద్య రంగాల నిపుణుల ఉపన్యాసాలు, సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లతో ముఖాముఖి ఉంటుందన్నారు. అంతేకాకుండా వివిధ ల్యాబ్ ల సందర్శన, అధునాతన ప్రయోగశాలలు, మ్యూజియం పరిశీలన ఉంటుందని చెప్పారు. కెరీర్ గైడెన్స్ పై అవగాహన కొరకు నీట్, యూజీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విధానం, వైద్య విద్య కెరీర్ అవకాశాలపై మార్గదర్శకత్వం ఉంటుందని వివరించారు. వైద్య రంగం గురించి విపులంగా, వివరంగా తెలుసుకునే సదవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 6300 177 677 నెంబర్ లో సంప్రదించాలని సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జయలత విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333