జార్జ్ఖండ్ నుండి కూలి పనులకు వచ్చిన వ్యక్తి రోడ్డుపై దుర్మరణం

Nov 25, 2024 - 19:37
Nov 26, 2024 - 07:46
 0  137
జార్జ్ఖండ్ నుండి కూలి పనులకు వచ్చిన వ్యక్తి రోడ్డుపై దుర్మరణం

అడ్డగూడూరు 25 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్: జార్ఖండ్ రాష్ట్రం నుండి అడ్డగూడూరు మండలంలో రోడ్డు కూలి పనులకు వచ్చిన వ్యక్తి బైక్ పై నుండి కింద పడి మరణించిన సంఘటన అడ్డగూడూరు మండలంలో ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గురజాల చౌళ్లరామారం గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుచున్నవి. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో హిట్టాచ్ మిషన్ డ్రైవర్ గా పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటూ సావ్ తండ్రి గులాబ్ సాబ్, వయసు 30 సంవత్సరాలు అనే వ్యక్తి నిన్న రాత్రి అనగా తేదీ 25 నవంబర్ 2024 రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన యొక్క బైక్ ఏపీ 15 ఎన్ 7818 నంబర్ గల బైక్ పై వెళ్తూ అడ్డగూడూరు గ్రామ శివారులో వెళ్లేసరికి తన బైక్ అదుపుతప్పి, ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గుంతలో పడి తలకి బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మరణించినాడు. ఇట్టి విషయం చుట్టుపక్కల వ్యవసాయ భూములు గల రైతులు చూసి పోలీసు వారికి సమాచారం ఇచ్చినారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం ఎస్సై నాగరాజు ఆసుపత్రికి తరలించారు.