పంచాయతీ పరిధిలో గల సమస్యలు పరిష్కరించాలి

Apr 8, 2025 - 19:48
Apr 8, 2025 - 19:52
 0  1
పంచాయతీ పరిధిలో గల సమస్యలు పరిష్కరించాలి

సత్యనారాయణపురం పంచాయతీలో పలు సమస్యలతో విలవిల

.వెంటనే పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమం చేపడుతాం

. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చా రామారావు

చర్ల మండలం సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలో సమస్యలు విలువతాండవం చేస్తున్నాయనీ వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరిన సిపిఎం పార్టీ మండల కమిటీ. ఇప్పటికీ సత్యనారాయణపురం గ్రామంలో ఒక వీధిలో త్రీ ఫేస్ కరెంట్ కావాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదనీ అలాగే వీధిలో మూడు స్తంభాలు అవసరమని వాటిని ఇకనైనా గుర్తించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు కోరారు. అదే గ్రామంలో రెండు సిసి రోడ్లు, మరియు మిషన్ భగీరథ నీళ్లు కొన్ని వీధులకు మాత్రమే వస్తున్నాయనీ మిగతా వీధులకు అసలు నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు కు ప్రజలు గురవుతున్నారని ఈ సమస్యలపై అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని గ్రామస్తులు సిపిఎం పార్టీ మండల నాయకులు యందు మొరపెట్టుకున్నారు. సత్తెనపురం పంచాయతీలోని సమస్యలను ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించే విధంగా చూడాలని లేనియెడల ప్రజలందరినీ ఐక్యత చేసి దశల వారి పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తాటి నాగమణి శాఖ సభ్యులు శ్యామల కాంతయ్య, ఊయిక లక్ష్మయ్య, గట్టుపల్లి కాంతమ్మ, కోరం రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు