సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే తుంగతుర్తి గడ్డమీద అడుగుపెట్టనీయం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

Aug 23, 2024 - 19:49
Aug 23, 2024 - 20:24
 0  260
సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే తుంగతుర్తి గడ్డమీద అడుగుపెట్టనీయం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

బాధితుల పరామర్శ..ఆర్థిక సహాయం

401 కోట్ల 41, లక్షల 69,970 రూపాయల రుణమాఫీ

నియోజకవర్గంలో 35వేల రైతాంగానికి రుణమాఫీ  

రుణమాఫీ కానీ రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు

బిఆర్ఎస్ ప్రభుత్వంలో దంద లు హత్యలు కొనసాగించిన బిఆర్ఎస్ ప్రభుత్వం 

బిఆర్ఎస్ నాయకులకు పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే మందుల సామెల్ 

తుంగతుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు, బిర్ఎస్ పార్టీకి లేదు

పాపిస్తూ ప్రభుత్వం పోయి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది

తిరుమలగిరి 24 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి చౌరస్తాలో గురువారం జరిగిన బిఆర్ఎస్-కాంగ్రెస్ పరస్పరదాడుల్లో గాయాలపాలైన కాంగ్రెస్ కార్యకర్తలను శుక్రవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండల కేంద్రంలోని స్వాతి హాస్పిటల్లో పరామర్శించారు.కార్యకర్తలకు అండగా నేనున్నానని భరోసా కల్పించి వైద్య ఖర్చులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.తదనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్యాగాల తెలంగాణలో భోగాల అనుభవించిన గా..బిఆర్ఎస్ బోకర్ గాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివాలాకోరు తనంతో తిన్నదంతా కక్కిస్తారనే భయానికి లోనవుతూ చిల్లర కార్యక్రమాలు చేపట్టి శాంతియుతంగావున్న తుంగతుర్తి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని చూడడం గురువారం కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేయడాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ ఖండించారు.గత పది సంవత్సరాల పరిపాలనలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు.దోసుకోవడం తప్ప..

చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని,అడ్డగూడూరు మండలం జానకిపురం,చిర్రగూడూరు గ్రామాలలో అక్రమ ఇసుక రవాణాను, అడ్డుకున్న వారిపై చివరికి మహిళలపై కూడా దాడి చేసి కేసులు పెట్టారన్నారు.అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో వెలుగు అంజయ్య,ఫణిగిరి అల్లయ్య లను హత్య చేసి చంపింది ఎవరన్నారు.పస్తాల గ్రామంలో యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు పాల్వాయి నాగేష్ పై దాడి చేసిన గుండాలు ఎవరని,అడ్వకేట్ యుగంధర్ పై చేసిన గుండాలు ఎవరు.. బిఆర్ఎస్ వాళ్లు కాదా..? అని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గమైన తుంగతుర్తికి ఏమి అభివృద్ధి చేయించాడో తెలుపాలన్నారు. దిగజారిన రాజకీయాలు మానుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెద్దేవ చేశారు.కాంగ్రెస్ పెద్దలపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని ఘాటుగా విమర్శించారు. బిఆర్ఎస్ నేతలకు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో..ప్రస్తుతం అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.గురువారం రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసి, రెచ్చగొట్టే నినాదాలు చేసి దాడులకు ఉసిగొలిపిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ పై ఎలాంటి అపోహలు వద్దని ఎవరికైనా రుణమాఫీ కాలేదంటే..కలెక్టర్ కు గానీ మండల వ్యవసాయ అధికారి కానీ దరఖాస్తు చేసుకొని ఏవైనా సాంకేతిక లోపాలతో జాప్యం జరిగివుంటే సరి చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 401 కోట్ల 41 లక్షల 69,970 రూపాయల రుణమాఫీ జరిగిందని, తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 35వేల రైతాంగానికి రైతు రుణమాఫీ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతని రైతుల పక్షాన నిలబడుతుందని ప్రజా పాలనలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు,పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్,కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు వై. నరేష్,మూల అశోక్ రెడ్డి,సుంకరి జనార్ధన్,పాలకుర్తి రాజయ్య, వార్డు కౌన్సిలర్లు,ఆయా మండలాల అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034