రైతులకు రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలి
మునగాల 23 ఆగస్ట్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు....
మునగాల:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ప్రకటించిన రుణమాఫీ ఇంకా 60 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని. వెంటనే రైతులందరికీ రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మునగాల డిప్యూటీ తాహశిల్దార్ సత్యనారాయణ కు మునగాల మండల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చేసిన వాగ్దానం. రైతులకు రుణమాఫీ ప్రకటించినట్లుగా రైతుకు రుణమాఫీ చెయ్యాలని కొన్ని తప్పిదాల వల్ల రైతులందరికీ రుణమాఫీ కాలేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం షరతులను సడలించి పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని. రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు. అట్లాగే వ్యవసాయ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్న రైతులకు, రైతు భరోసా రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదని రైతులకు పెట్టుబడులకు సహాయం గా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు మండవ వెంకటాద్రి,పిచ్చయ్య, సిఐటియు మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం, రైతు సంఘం నాయకులు గోపిరెడ్డి మల్లారెడ్డి, అనంతు కోటి, తదితరులు పాల్గొన్నారు.