గాలి వాన బీభత్వానికి భారీ ఆస్తి కష్టం

May 6, 2024 - 05:42
 0  60
గాలి వాన బీభత్వానికి భారీ ఆస్తి కష్టం
గాలి వాన బీభత్వానికి భారీ ఆస్తి కష్టం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి గాలి వాన బీభత్సం కూలిన చెట్లు స్తంభాలు.. తెగిన విద్యుత్ తీగలు.. గాలికి లేచిపోయిన ఇండ్ల పై కప్పులు.. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఒక్క సారిగా గాలి వాన ఉరుములు మెరుపులు బయాందోళన సృష్టించాయి. మండలం లోని సూర్యాపేట దంతాలపల్లి రోడ్డు పై పాతర్ల పహాడ్ స్టేజీ నుండీ సుమారు 3కిలో మీటర్ల మేర భారీ చెట్లు కూలి పడి రాకపోకలు నిలిచి పోయాయి. సుమారు గంటన్నర కు పైగా రాక పోకల కు అంతరాయం ఏర్పడింది.నూతన కల్ నుండి పేషెంట్ తో వస్తున్న అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కి పోయింది. పాతర్ల పహాడ్ లో సోములు రేకుల ఇంటిపై విద్యుత్ స్తంభం విరిగి పడింది ఈ ప్రమాదం లో ఇల్లు ద్వంసo అయింది. ఏపూర్ లో సానబోయిన సోమయ్య తన గేదే ను ఇంటి ముందు చెట్టుకు కట్టేసి ఉండగా చెట్టు కూలి గేదె పై పడడం తో గేదె మృతి చెందినది. పీపనాయక్ కర్రోని తండ లో గుగులోతు బుజ్జమ్మ రేకుల ఇల్లు గాలి కి లేచిపోయింది. బోరింగ్ తండాలో రేషన్ షాపు పై కప్పు రేకులు లేచి పోవడం తో బియ్యం బస్తాలు తడిసి పోయాయి. గట్టి కల్ లో మడ్డి సాలమ్మ ఇంటి ముందు వేప చెట్టు విద్యుత్ తీగలపై కూలడం తో తీగలు రోడ్డు పై తెగి పడ్డాయి. పాతర్ల పహాడ్ స్టేజీ వద్ద రావుల సతీష్, భద్రయ్య లక్ష్మయ్య,మధుకర్, సురేష్,ల రేకుల ఇండ్ల పై కప్పులువిరిగిపూర్తిగా లేచి పోయాయి. పాతసూర్యాపేట లో విద్యుత్ మెయిన్ లైన్ స్తంభం గూడూరు వెంకట్ రెడ్డి ఇంటి పై పడింది. ఇల్లు ధ్వంసం అయింది. గొర్రెలు కు తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్లపు శంకర్, కొప్పు హరీష్ రేకుల గాలికి కూలిపోయాయి .విరిగిపూర్తిగా లేచి పోయాయి. బోరింగ్ తండాలో కూలిన రేషన్ షాపు తడిసిన బియ్యం బస్తాలు