సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
![సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం](https://telanganavaartha.com/uploads/images/202502/image_870x_67a3f8e316a25.jpg)
తిరుమలగిరి 06 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై కేబినెట్ తీర్మానం బీసీల కుల గణన 42% నిర్ధారించినందుకు గాను కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాసనసభ్యులు మందుల సామేల్ చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు, ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో ఏనాడూ లేని విధంగా ఈనాడు గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్న ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు చరిత్రలో ఇది సువర్ణ అవకాశమని చెప్పారు ఆనాడు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో రకాల ఉద్యమాలు చేసి నా ఆనాటి పాలకులు స్పందించలేదని అని అన్నారు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల డిమాండ్ న్యాయమైనదని అంగీకరించి వారికి రాజ్యాంగ ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆమోదం తెలిపారని అన్నారు అలాగే బీసీ కులగ ణన 42 శాతం నిర్ధారించడం సాహసూపేతమైన నిర్ణయం అని ఆయన అన్నారు బీసీలకు చట్టప్రకారం రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో ఇంటింటా సర్వే నిర్వహించి కులగణన నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎంతో అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గేలుసుకోవడం ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్ ,మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, తుంగతుర్తి నియోజకవర్గ ప్రెస్ ఇన్చార్జి కందుకూరి లక్ష్మయ్య , దుప్పటి మల్లయ్య, ఫతేపురం సుధాకర్, గజ్జి లింగయ్య, వంగాల దానయ్య, ఎర్ర నరేష్, రాము గౌడ్, గణేష్, రాకేష్, లకుపతి, తదితర గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.