సుందరయ్య కాలనీ పేదలకు ఇండ్ల పట్టాలి ఇవ్వాలి

తిరుమలగిరి 26 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో గత 25 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సుందరయ్య కాలనీలో ప్రజా సమస్యలపై సర్వే చేయగా ప్రజలు అనేక సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది కాలనీకి సరైన రోడ్డు సౌకర్యం లేక మోటార్ బైకు సోధకులు మరియు వృద్ధులు జారిపడి కాళ్లు చేతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు డ్రైనేజీ వ్యవస్థ మురుగు కాలువలు లేక మురికి నీరు రోడ్లపై ప్రవహించి ఈగలకు దోమలకు అలవాలమైనాయి దీనివలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. తాగునీరు కూడా సక్రమంగా రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కావున ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని సీసీ రోడ్డు నిర్మాణం త్రాగునీరు మురికి కాలువల నిర్మాణం ఏర్పాటు చేయాలని అర్హత కలిగిన వారికి వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుమ్మడవెల్లి ఉప్పలయ్య మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి లక్ష్మి కాలనీవాసులు పి నగేష్ వరుసు అంజయ్య వాసమ్మ కటారి యాదమ్మ ఎలుక కళమ్మ అంజలి తదితరులు పాల్గొన్నారు...