సిపిఐ నేత ధనుంజయ నాయుడు కు ఘన సన్మానం

ఇటీవల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన ధూళిపాళ ధనుంజయ నాయుడుకు గరిడేపల్లి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం గరిడేపల్లి మండల అధ్యక్షుడు కడియాల అప్పయ్య నాయకత్వంలో కందుల వెంకన్న కాలం సైదులు తాళ్లూరు విజయ్ తదితరులు హాజరై శాలువాతో సన్మానించిన అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పార్టీ 100వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టుల పునరేకీకరణ జరుగుతున్న నేపథ్యంలో దేశంలో కులం మతం లాంటి అసమానతలను రెచ్చగొట్టి మతం పేరుతో రాజకీయం చేసుకుంటూ దేశాన్ని ముక్కలు చేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ఒకపక్క ఓట్ల చోరీ చేస్తూ, మరోపక్క వ్యవసాయని ధ్వసం చేసేందుకు గత సంవత్సరం మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచేందుకు ప్రయత్నించారని ఈరోజు యూరియా కొరత సృష్టించి రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులపై మరింత బాధ్యత పెరిగిందని క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరింపజేసి ప్రజాసంఘాల నిర్మాణం చేసి కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తేవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఈ సందర్భంలో రాష్ట్ర కమిటీ లో తనకు స్థానం కల్పించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ బెజవాడ వెంకటేశ్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు తన ప్రాధాన్యతను గుర్తించి సన్మానం చేసిన గరిడేపల్లి మండలం మున్నూరు కాపు సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు అండదండ ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు