సిపిఎం పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు

మునగాల 27 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- దోపిడి ఉన్నంతవరకు కమ్యూనిజం అజేయంగా నిలుస్తుంది ... జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్స్ స్టు ) సిపిఐ( ఎం) పార్టీ మునగాల నడిగూడెం పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులు రేపాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రాజకీయ శిక్షణ తరగతులను సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు క్లాసులను బోధిస్తూ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను సీపీఐఎం ఏర్పడిన తీరును, ప్రపంచ మానవాళికి కమ్యూనిజమే మార్గమని బోధించడం జరిగినది. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ మధ్యాహ్నం పార్టీ ప్రజా సంఘాల నిర్మాణ అంశమును భవిష్యత్తు కర్తవ్యాలను బోధించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ గా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య వ్యవహరించినారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుర్రి శ్రీరాములు పార్టీ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నడిగూడెం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు దేవర వెంకటరెడ్డి, జడ్పిటిసి సభ్యులు దేశీరెడ్డి జ్యోతి, మండల కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం వీరబోయిన ఎంకన్న విజయలక్ష్మి,ఎస్ కే సైదా, కొండారెడ్డి,దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి,వీరాంజనేయులు,కాసాని కిషోర్ రమేష్,సతీష్,వెంకటాద్రి, ఉపేందర్, గోపయ్య,గోగిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు