మెగా డీఎస్సీ వేయాలి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పెంచాలి.. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్

మొనగాల 27 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ప్రభుత్వా డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మండల కేంద్రం తో, పాటు నేల మర్రి గ్రామాల్లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువజన సమస్యల పై సర్వే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ నియామాకాల పై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వం ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించాలని కోరారు. మెగా డీఎస్సీ ప్రకటించడంతోపాటు 25 వేల డిఎస్సి పోస్టులు పెంచాలని అన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ కనుగుణంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు గ్రూప్ 1లో 1:100 పోస్టులు పెంచి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వం చెల్లిస్తానన్న నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని కోరారు. ఉద్యోగ నియామాకుల విషయంలో గత ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఉద్యోగ నియామకాల వాగ్దానాల అమలు కోసం చొరవ చూపాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ఉన్నత విద్యా వంతులు సరైన విద్యా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ ఉపాధి అవకాశాలు చూపెట్టాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాసాని కిషోర్ బోయిళ్ల నవీన్ నాయకులు వినోదు సతీష్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.