పోక్సో కేసు నిందితుడికి 3 సంవత్సరాల ల జైలు శిక్ష మరియు 5000/- రూపాయాల జరిమానా
విధిస్తూ తీర్పు వెల్లడించిన జిల్లా PDJ కోర్టు గౌరవ జడ్జీ I/c పోక్సో కోర్టు జడ్జి శ్రీ కుషా ..
జోగులాంబ గద్వాల 26 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. మైనర్ బాలికపై హత్యాచారానికి యత్నించిన పోక్సో కేసు నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- రూపాయాల జరిమానా విధిస్తూ జిల్లా PDJ కోర్టు జడ్జీ I/c పోక్సో కోర్టు జడ్జి శ్రీ కుషా ..ఈ రోజు తీర్పును వెల్లడించారు. కేసు వివరాలు కేసు వివరాలు: తేది :13.08.2020 నాడు మల్దకల్ మండలం లోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ కు వచ్చి తేది 12.08.2020 నాడు కుటుంబ సభ్యులతో కలసి పత్తి పొలం లోని సీడ్ క్రాసింగ్ కోసం వెళ్ళి పొలం లో పనులు చేసుకొని సాయంత్రము బహిర్భూమికి పక్క పోలం లోకి పోయి వస్తుండగా ప్రక్క పొలం కు చెందిన నిందితుడు ఆ మైనర్ బాలికను బలవంతంగా పట్టుకొని అరవకుండా ఉండేందుకు నోట్లో బట్ట కుట్టి హత్యాచారయత్నం చేయగా బాలిక గట్టిగా అరుస్తూ నిందితుడి నుండి తప్పించుకొని తమ పొలం లోని అమ్మ నాన్నల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి నిందితుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు క్రైం నం 168/2020 u/s 376 r/w 511ipc ,sec 7 r/w 8 of POCSO Act గా కేసు నమోదు చేయడం జరిగింది.
అనంతరం అప్పటి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అప్పటి పోలీస్ అధికారులు మైనర్ బాలిక పై నిందితుడు హత్యాచార యత్నం చేసింది నిజమని తేలడంతో వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు IPS ఆదేశానుసారం కోర్టులో కేసు ట్రయల్ సమయంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె . గుణ శేఖర్ పర్యవేక్షణలో డి. ఎస్పీ శ్రీ సత్యనారాయణ , గద్వాల్ సి . ఐ బీమ్ కుమార్ , ఎస్సై సురేష్ గౌడ్ కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.
. ఈరోజు జిల్లా PDJ కోర్టు జడ్జీ I/c పోక్సో కోర్టు జడ్జి శ్రీ కుషా . ఇరువురి వాదనలు విన్న తర్వాత నిందితుడి పై నేరం రుజువైనoదున నిందితుడు తెలుగు జయరాం s/o చిన్న బిసన్న, వయసు -20 సం"లు, వృత్తి - కూలీ,R/o మల్దకల్ మండలం కు
3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.నేరస్థులకు జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనంద్ కుమార్ కోర్టు కానిస్టేబుల్ లు రామ్ దాస్, స్వామి రాజు సహకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారులు అయిన ఎస్సై లు కె . ఓబుల్ రెడ్డి, ఆర్.శేఖర్ లను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ కుమార్ ని, కోర్టు లై సన్ అధికారులు ఎస్సై అరుణ, హెడ్ కానిస్టేబుల్ సాయి బాబా, కోర్టు డ్యూటీ అధికారులు రామ్ దాస్, స్వామి రాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు.