సాయి గాయత్రి విద్యాలయంలో ఘనంగా రంగోలి ఉత్సవాలు

Jan 10, 2025 - 17:08
Jan 10, 2025 - 17:10
 0  9
సాయి గాయత్రి విద్యాలయంలో ఘనంగా రంగోలి ఉత్సవాలు
సాయి గాయత్రి విద్యాలయంలో ఘనంగా రంగోలి ఉత్సవాలు

మునగాల 11 జనవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల కేంద్రంలో గల సాయి గాయత్రి విద్యాలయలో సంక్రాంతి పండుగలో భాగంగా శుక్రవారం రోజు విద్యార్థిని విద్యార్థులకు  ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో సుమారుగా 80 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరిగా పోటీల నిర్వహించగా ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ జులియానా , క్యాషియర్ శ్వేత  బహుమతులను అందజేయడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విధేయత ప్రాధాన్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి ఉష రాణి , ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ , ఏవో ఆర్ ప్రభాకర్ రెడ్డి , మరియు ఉపాధ్యాయ బృందం ,  పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State