జిల్లా గ్రంథాలయ శాఖకు తాళం వేసి నిరసన చేపట్టిన పాఠకులు

Jun 12, 2026 - 20:39
Jun 12, 2026 - 21:05
 0  1

కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని ఆరోపణలు

జోగులాంబ గద్వాల 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  గద్వాల పట్టణంలో గల‌ జిల్లా గ్రంథాలయానికి బీఅర్ఎస్వీ నాయకులు కుర్వపల్లయ్య ఆధ్వర్యంలో పాఠకులు తాళం వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలయ్యారని ఆరోపించారు. ఒకే గదిలో  20మందికి పైగా నిరుద్యోగులు కూర్చుని వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారని, ప్యాన్లు,‌ కుర్చీలు, త్రాగు నీటి ఇబ్బంది ఉన్న అధికారులు కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆరోపించారు. అధికారులు వచ్చేంతవరకు లైబ్రరీ తెరిచేది లేదని పేర్కొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State