సామాజిక ఎదుగుదల లేని కుటుంబాలు  ఒక తరం వెనుకబడి పోతాయి

Jun 10, 2026 - 00:11
Jun 10, 2026 - 22:27
 0  4
సామాజిక ఎదుగుదల లేని కుటుంబాలు  ఒక తరం వెనుకబడి పోతాయి

సామాజిక ఎదుగుదల లేని కుటుంబాలు ఒక తరం వెనుకబడి పోతాయి. ఆస్తులు సంపదలు మాత్రమే కాదు సామాజిక కుటుంబ బంధాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రవేశం కూడా ముఖ్యమే కదా! వెలివేయబడితే... మనభాద్యత ఏది..?

---వడ్డేపల్లి మల్లేశం

కోట్ల  ఆస్తులు  వివిధ రకాల సంపదలు  ఉన్నప్పటికీ  అనారోగ్యవంతులైనటువంటి  కోటీశ్వరుల కంటే  పూరి గుడిసెలో ఉన్నటువంటి  ఆరోగ్యవంతులైన పేదవాళ్లు  ఎక్కువ సుఖపడతారు  జీవించనంత కాలం హాయిగా ఆనందంగా జీవిస్తారు,  సంపదల తేడే కావచ్చు కానీ  ఆరోగ్యానికి ఇవేవీ పట్టవు.  ఇంత క్రియాశీలకమైన  బావ వైవిధ్యము  తేడా ఉండడం వల్లనే  ఈ వాక్యం సుమారు 50 సంవత్సరాల క్రితం  రెండవ మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో  తొలి వాక్యంగా ముద్రించబడినట్లు నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఇందులో ఎంత వాస్తవం ఉందో  సామాజిక సంబంధాలు బలంగా కలిగి ఉండి  పేదరికంతో కునారెల్లి పోయినా కూడా   ఎక్కువ ఆనందంగా సంతోషంగా జీవించలేరు సంబంధాలు లేకుండా  తమ కు తామే అంకితమై  సంపాదన చూసుకొని మురిసిపోయే వారి కంటే  అనే దానిలో కూడా అంతే అర్థం దాగి ఉంది .

ఆరోగ్యమే మహాభాగ్యము,    తృప్తిని మించిన ధనము లేదు,  ఇల్లు అలుకగానే పండుగ కాదు,  పేదవాని కోపం పెదవికి చేటు కాదు కలవాడి పదవికి చేటు,  సంతోషం సగము బలము అనే సామెతల్లో ఎంత నిండు అర్థం ఉందో  అదే మాదిరిగా సామాజిక సంబంధాలను కొనసాగించకుండా  కుటుంబ బంధాలకు కూడా దూరమై  తోటి మనిషిని సాటి మనిషిగా చూడకుండా  స్వార్థపు ఆలోచనలతో  ఇంటికే పరిమితమైన వాళ్ళ జీవితం కూడా ఒకరకంగా వెలివేయబడినట్లే  అనడంలో  సందేహం లేదు.

ఒక కుటుంబానికో ఒక వర్గానికో  సంబంధించిన అంశం కాదు ఇది.  మానవ సామాజిక జీవన పరిణామ క్రమంలో  తమ కుటుంబ ఎదుగుదల ఎంత ముఖ్యమో ఇతర కుటుంబ సంబంధాలను  కొనసాగించడం, మానవ సంబంధాలలో మరింత దూసుకుపోవడం,  అంతిమంగా సామాజిక పరంగా  పరిణతి సాధించి  తమకంటూ ఒక స్థానాన్ని పదులపరుచుకోవడం కూడా అంతే ముఖ్యం. అలాంటిదే నిజమైన జీవితం అందుకే  అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అన్న మాటకు ఇదే కదా అర్థం. ఆదిమ కాలంలో  కుటుంబ బంధాలు లేని సమయంలో కూడా  మాటలు రాకపోయినా సైగల ద్వారా తమ చేష్టలను స్పష్టపరుచుకున్న కాలంలో కూడా కొంత  సంబంధాల కొనసాగింపుకు ఆశపడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటే ఆధునిక కాలంలో  ఉన్నత విద్యార్హతలను కలిగి ఉండి,  సంపద ఇబ్బడి ముబ్బడిగా ఉండి,  ఏ ఇతర కారణాల వలన దురహంకారపూరితులై  తమకు తామే గొప్పవాళ్ళు అని విర్రవీగే లక్షణం ఎప్పుడైతే మానవుడిలో రంగ ప్రవేశం చేసిందో అప్పుడే బంధాలు విచ్చినమైపోయాయి.  డబ్బున్నంత మాత్రాన పేదవాళ్లతో ఇతర సమాజంతో సంబంధం లేకుంటే బతకగలమ నుకోవడం మూర్ఖత్వం.  కాయకష్టం చేసి, చెమటవడిసి, ఉత్పత్తులు పెంచి, నిర్మాణాలలో పాల్గొంటున్న వాళ్లంతా కూడా పేద వర్గాలే అనే సోయి మరిచిపోకూడదు.  అన్ని సందర్భాలలో డబ్బు మాత్రమే సరిపోదు. సేవ, శ్రమ, సహకారము, ప్రోత్సాహము, ఓర్పు,  స్వయంగా పాల్గొనడం వంటి  అo శాలు కూడా ఇమిడి ఉంటాయి. అందుకే  తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలి అని మన పెద్దలు సమాజ నిర్మాణానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రాన్ని  చెప్పి ఏనాడో ప్రోత్సహిస్తే ఆ ప్రధానమైన సూత్రాన్ని మరిచి  తోటి మనిషిని అసహ్యించుకుంటూ,  అన్నింట్లో తాను గొప్ప వాడినని విర్రవీగుతూ,  చివరికి  అవమానాల పాలవుతు, ఒంటరిగా మిగిలిపోతున్నాడు. చనిపోయి శవమైతే కూడా పీనుగు మో యడానికి నలుగురు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితులకు దిగజారుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు సామాజిక సంబంధాలు లేకుంటే ఎంత దుర్గతి పడుతుందో !

సంబంధాలను  కొనసాగించలేకపోతుండ్రు ఎందుకు?

ఈ రకానికి సంబంధించిన వారు  సహజంగా  అసూయపర్లు,  ఇతరుల పురోగతిని  తట్టుకోలేని వాళ్లు,  తమ వ్యక్తిగత అవ లక్షణాలను  మిగతా సమాజం చూడకుండా దాచుకోవడానికి ఇష్టపడేవాళ్లు,  సామాజిక లక్షణాలకు భిన్నమైన పద్ధతిలో  ఒంటరితలంగా బతకడానికి సిద్ధపడిన వాళ్లు, నేరాన్ని అంగీకరించరు, ఎంతకైనా తెగిస్తారు  కనుక  ఎక్కడ  పరువు పోతుందోనని
సామాజిక సంబంధాలను అంతగా కలిగి ఉండరు.  హింస ప్రవృత్తి,  మానసిక వైకల్యం,  కోపము,  అసూయ ద్వేషాలు ఇలాంటి వాళ్లకు మెండుగా ఉంటాయి.  కనక వీళ్ళు ఇతరులతో పోల్చుకోవడానికి కలిసి ఉండడానికి  ఇష్టపడరు కూడా. కానీ ఇలాంటి కుటుంబాలు  వందలు వేలు లక్షల సంఖ్యలో ఉంటాయి సమాజంలో  ఇలాంటి కుటుంబాల పట్ల మిగతా సమాజం  జాగ్రత్తగా ఉండడంతో పాటు  అవసరమైన సందర్భంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.  ఎందుకంటే వీళ్ళు ప్రమాదకారులుగా  ఇతరులకు నష్టం కలిగించే వాళ్ళుగా మిగిలిపోతారు.  సహ సంబంధం లేకపోయినా పరవాలేదు కానీ హాని చేయాలనే దుస్సాసము, దుస్సంకల్పము, కుట్ర కుతంత్రాలు కలిగి ఉండడం  మిగతా సమాజానికి ప్రమాదకరం కదా! ఇలాంటి సందర్భాలలో జరుగుతున్నదే  హత్యలు, అత్యాచారాలు, దాడులు,  గృహ దానాలు, ఆత్మహత్యలు, హింస  మొదలైనవి ఇలాంటి సన్నివేశాలు  ఆ కుటుంబాల వరకు మాత్రమే పరిమితం కాకుండా మిగతా సమాజాన్ని కూడా ప్రభావితం చేయడం వలన కూడా మంచి వాళ్ళు కూడా చెడ్డవాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది బాధాకరమైన విషయం.  అందుకే మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్న,  ఆరోగ్యవంతమైన సమాజాన్ని సాధించాలనుకున్న  సంబంధాలు బలంగా ఉండడం  ఆ సంబంధాలు కూడా ఆరోగ్యకరమైన సంబంధాలు చాలా అవసరం.  నైతిక విలువలు,  ఆధ్యాత్మిక విలువలు, మానవీయ విలువలు,  బలమైన కుటుంబ భావన,  గౌరవమర్యాదలు,  ప్రేమానురాగాలు  కలిగి ఉండడం ద్వారా ఇలాంటి ఆటంకాలకు అక్రమ   సంబంధ బాంధవ్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు.  ఇప్పటికీ కొన్ని కుటుంబాలు  పల్లెటూర్లలో పట్టణాలలో వెలివేయబడినట్లు  మిగతా సమాజంతో సంబంధం లేకుండా ఉన్నట్లు  ప్రచారంలో ఉంటాయి.  మానసిక సహజ ప్రవృత్తి కొంత కారణమైతే  సహవాస దోషము,  ఆధునిక ప్రసార మాధ్యమాలు, టీవీ ప్రసారాలు సినిమాలు  సెల్ ఫోన్ లోని మిగతా  కార్యక్రమాలు కూడా మనుషులను ఆ రకంగా గి రిగేసుకొని బతికే లాగా తయారు చేస్తున్నవి. అంతటితో ఆగకుండా  రకరకాల ఆటలు ఆడడం, అప్పులు చేయడం, అప్పులు పెంచి  చెల్లించలేని పరిస్థితిలో చివరికి ఆత్మహత్యలకు పాల్పడడం, లేదా హత్యలకు దిగజారడం, కుటుంబాలకు  కుటుంబాలే బలిగావడం,  ఇల్లు యావదాస్తిని అమ్మి అప్పులు చెల్లించడం వంటి  సంఘటనలను మనము విద్యావంతులైన కుటుంబాలతో సహా పేద ఇళ్లలో కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇది మిగతా సమాజానికి కూడా తాకే అవకాశం ఉంటుంది.
 మానవ అవసరాలు అని ప్రధానంగా నిర్వచించుకున్న కూడు గూడు గుడ్డ  మాత్రమే సరిపోవు.  కాలానుగుణంగా మనిషి అవసరాలు  నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు  మారుతూ ఉంటాయి.  వాటితో పాటు విద్య  స్నేహము  ఆలోచన వివేచన  మంచివారి స్నేహము  నీతి పుస్తకాలు చదవడం  పెద్దల మాట వినడం  సభలు సమావేశాలకు హాజరు కావడం  మానవీయ అవసరాలు పరిష్కారాలను  ఆలోచించడం  వల్లించడం  వర్ణించడము  తెలుసుకోవడం  అన్నీ కూడా జీవితంలో బాగాలే.  నువ్వేం తింటున్నావ్? ఏ నీడలో బతుకుతున్నావ్? ఏ బట్టలు కడుతున్నావు? అనేది ఇవాళ ప్రధానం కానే కాదు  కానీ ఏ రకంగా సమాజంలో జీవిస్తున్నావు?  ఏ రకమైన మానవీయ విలువలతో  సామాజిక హోదా అనుభవిస్తున్నావు?  ఇతర ప్రపంచానికి ఏమైనా  దారి చూపగలవా? ఆదర్శంగా జీవించగలవా? అనేది కొ లమానంగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితులలో  కామన్ సెన్స్ లేకుండా  వికృత పద్ధతిలో విషమ ఆలోచనలతో  అసమ ఆలోచనలతో  అసూయ ద్వేషాలనుతో గూడు కట్టుకున్న మానవులు  స్త్రీ పురుషులు ఎవరైనా  సమాజానికి విద్రోహం తలపెట్టే వాళ్లే చివరికి కుటుంబానికి కూడా. 

నిరుత్సాహం పనికి రాదు:

ఆర్థిక   అసమానతలతో కూడుకున్న సమాజం కంటే  అమానవీయ విలువలతో కూడుకున్న  కుటుంబాలు  సమాజానికి పెద్ద ప్రమాదకరం. ఎక్కడి వాళ్ళు అక్కడ అడ్డగించడమే కాదు  కట్టడి చేయాలి,  వెలివేయాలి, కఠిన శిక్షలు విధించాలి,  సంస్కరణలు తీసుకురావాలి, అంతిమంగా వాళ్లను మనుషులుగా మార్చాలి, అదే  మన లక్ష్యం అయి ఉండాలి. "" మన చుట్టూ ఉన్న సమాజంలో అత్యంత పేదవాళ్లు దయనీయ స్థితిలో బతుకుతున్న వాళ్ళు  కూడు గుడ్డకు నోచని వాళ్లు,  వీధుల వెంట తిరిగాడుతున్న వాళ్లు కనిపిస్తూ ఉంటారు.  కానీ వాళ్లలో నైతిక విలువలు, స్వయంకృషి, హాని చేయని తత్వం స్పష్టంగా కనబడతాయి.  అలాంటి వాళ్లను మనం ఆదరించము, కనుకరించము, విలువి య్యము, వాళ్లను అల్పంగా హీనంగా చూస్తాం,  అదే మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం. విజ్ఞతగా జీవించడం అంటే పెద్దపెద్ద పట్టాలతో బతకడం కాదు,  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవడం అలాంటి వాళ్లకు అవకాశాన్ని కల్పించడం, సహకరించడం, ప్రోత్సహించడం.  ఇవాళ ఈ అసమానతలతో అంతరాలతో కూడుకున్న వ్యవస్థలో అలాంటి సహకారం చాలా అవసరం. బుద్ధి జీవులుగా, మేధావులుగా,  మానవతావాదులుగా మనం ఉన్న ప్రతి చోట నిరంతరం  ఆలోచించాలి.  పాలకులకు కనువిప్పు కలిగించాలి.  పెట్టుబడిదారులకు  సోయి తేవాలి. మానవతా విలువలకు అతీతమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదని రుజువు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరి సమ సమాజం సాధ్యమవుతుంది. అసమానతలు తొలగి  మనిషిని సాటి మనిషిగా చూసే మానవీయ కోణం ఆవిష్కృతం అవుతుంది.""
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ( చౌటపల్లి  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333