పండుగ ముచ్చట్లు

పండుగ ముచ్చట్లు
సంక్రాతి సందడి
పల్లెకుపోదాం పదండి
అందరు కలవండి
ఆడండి పాడండి
సాంప్రదాయాలను
మరువకండి
సంబంధాలను
కొనసాగించండి
బంధాలను పటిష్ట పరుచుకోండి
పిల్లల ఆటలు పాటలు
రక రకాల పిండి వంటలు
రుచికరమైన భోజనాలు
రంగు రంగులవస్త్రాలు ముగ్గులతొ అలంకరణాలు
కొత్తవారితో పరిచయాలు
పచ్చని పల్లె అందాలు
పశు,పక్షుల అలజడులు
సీతాకొక చిలుకల సంబరాలు
పరవశించిపోయే పల్లె జనాలు
ప్రొద్దుననే పోగమంచు
ఒకరికి ఒకరు పలకరింపు
పాలు, నీళ్లు సేకరింపు
పాయసం, నైవేద్యం వడ్డింపు
ఇష్టంగా ఆరగింపు
ఊరంతా జాతర
పొట్టేలు, కోడి పంధ్యాలు
రికార్డింగ్ డాన్సులు
డ్రామాలు నాటకాలు
వివిధ రూపాల ప్రదర్శనలు
త్రాగెవారు, ఊగెవారు
తగువులాడేవారు
సర్థిచెప్పేవారు
తమాషాలు చూసేవారు
కలిసి మెలిసి తిరిగేవారు
సంక్రాతి జ్ఞాపకాలు
మదిలో పదిలంగా ఉంటాయి
మల్లి వచ్చే పండుగ వరకు
మనసులో మెదులుతు ఉంటాయి
ఇది ప్రకృతితొ మమేకమయేది
ఈ పండుగ ప్రశాంతంగా జరుపుకొనేది.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్